ETV Bharat / state

మద్యం అమ్మకాలపైనే రాష్ట్రాల ఆదాయాలు

author img

By

Published : Jun 8, 2020, 4:50 AM IST

దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే రాబడులపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వచ్చే పన్నుల ఆదాయంలో 12.5 శాతం మద్యం ద్వారానే వచ్చేదని ఆర్​బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2018-19 ఆర్థిక ఏడాదిలో ఒక రూ. లక్ష 50 వేల కోట్ల రాబడులు రాగా... 2019-20లో ఒక రూ. లక్ష 75 వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ బడ్జెట్‌లో పేర్కొన్నాయి.

states depends on liquor income in india
మద్యం అమ్మకాలపైనే రాష్ట్రాల ఆదాయాలు

రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం తెచ్చి పెట్టే వనరుల్లో మద్యం అమ్మకాలు ప్రధానమైంది. జీఎస్​టీ, వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయం తర్వాత... అత్యధికంగా మద్యం అమ్మకాలు ద్వారానే వస్తోంది. అందుకే ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై ఎక్కువ మక్కువ చూపిస్తాయి.

2018-19లో లక్షా 50 లక్షల 658 కోట్ల ఆదాయం

కొన్ని రాష్ట్రాలకు మద్యం ద్వారా వచ్చే రాబడులే కీలకంగా మారాయి. మద్య నిషేధం కొనసాగుతున్న బిహార్‌, గుజరాత్‌ను మినహాయిస్తే... 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో లక్షా 50 లక్షల 658 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో 16 శాతం పెరుగుదలతో లక్షా 75 లక్షల 501 కోట్లు మద్యం ద్వారా రాబడులు వస్తాయని... రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

కరోనాతో రాబడి తగ్గే అవకాశం

2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులు నెలవారీగా బేరీజు వేస్తే... సగటున ప్రతి నెల రాష్ట్రాల నుంచి రూ. 12 వేల 500 కోట్లు మద్యం ద్వారా రాబడులు వస్తున్నాయి. 2019-20 ఆర్థిక ఏడాదిలో ప్రతి నెల రూ. 15 వేల కోట్లు వస్తాయని అంచనా వేయగా... కరోనా పరిస్థితుల నేపథ్యంలో... ఆ మొత్తంలో కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దిగుమతి సుంకం ద్వారా ఆదాయం

మద్యంపై విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం, ప్రత్యేక రుసుముతోపాటు.. విదేశీ లిక్కర్‌పై విధిస్తున్న దిగుమతి సుంకం ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 25 వేల కోట్లు రాబడి రాగా... గత ఆర్థిక ఏడాదిలో రూ. 31 వేల 517 కోట్లు ఆదాయం వస్తుందని ఆ రాష్ట్ర బడ్జెట్‌లో పేర్కొంది. ఆ తర్వాత ఎక్కువగా కర్ణాటకలో 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ. 19 వేల 750 కోట్ల రాబడి రాగా... గత ఆర్థిక ఏడాదిలో రూ. 20 వేల950 కోట్లు వస్తుందని ఆ రాష్ట్రం అంచనా వేసింది.

లాక్‌డౌన్​తో‌ అంతరాయం

మహారాష్ట్ర 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ. 15వేల343 కోట్ల ఆదాయం రాగా... గత ఆర్థిక ఏడాదిలో రూ.17 వేల 477 కోట్లు వస్తుందని ఆ రాష్ట్రం తమ బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొంది. ఆర్థిక ఏడాదికి రూ. పదివేల కోట్లకుపైగా మొత్తం రాబడులతో పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాలు ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. మద్యం అమ్మకాలపై ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రాలకు... లాక్‌డౌన్‌ అంతరాయంగా మారింది. ఫలితంగా రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. గత నెల 6 నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నాయి.

ఇవీ చూడండి: కరోనా ప్రభావం, లాక్​డౌన్​ అమలుపై రేపు కేసీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.