ప్రభుత్వం ఆశా కార్మికుల జీతాలను తక్షణమే పెంచాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గుర్రం శంకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్లో ఆశా వర్కర్లకు అనిల్ కుమార్ యాదవ్ నిత్యావసర సరకులు అందజేశారు.
కొవిడ్-19 వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి... తక్షణమే వారి జీతాలు రెండింతలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు