ETV Bharat / state

SUNITHA LAXMA REDDY: బాధితురాలు చెబితే తప్ప ఏం జరిగిందో తెలీదు..!

గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగిందనే ఆరోపణల గురించి బాధితురాలు చెబితే తప్ప ఏం చెప్పలేమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించినట్లు ఆమె వివరించారు.

state-womens-commission-chairperson-sunitha-laxmareddy-responds-on-gandhi-rape-issue
బాధితురాలు చెబితే తప్ప ఏం జరిగిందో తెలీదు..!
author img

By

Published : Aug 17, 2021, 12:53 PM IST

గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెలిపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు జరుగుతోందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆమె... సూపరింటెండెంట్‌ రాజారావుతో సమావేశమయ్యారు. అక్కాచెల్లెలి అత్యాచార ఘటన ఆరోపణలను గురించి అడిగి తెలుసుకున్నారు.

బాధితురాలు చెబితే తప్ప ఏం జరిగిందో తెలీదు..!

బాధితురాలితో ఈరోజే మాట్లాడతా..!

బాధితురాలు చెబితే తప్ప ఏం జరిగిందో చెప్పలేమని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బాధితురాలితో ఇవాళే మాట్లాడతానని తెలిపారు. పూర్తి విచారణ జరిగిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయన్న ఆమె.. మరో బాధితురాలు ఎక్కడ ఉందో ఇంకా గుర్తించలేదని వివరించారు. దోషులపై కఠిన చర్యలు ఉంటాయని.. బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.

ఆ అమ్మాయి కంప్లీట్​గా డీటెయిల్స్ చెప్తే కాని ఏం తెలియని పరిస్థితి. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇక్కడున్నటువంటి రేడియోగ్రాఫర్​పైన అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి అంటే ఇక్కడ సీసీ కెమెరాస్​ ఉన్నయ్. మరియు హాస్పిటర్ స్టాఫ్ ఉంది. పోలీస్ సెక్యూరిటీ ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎంక్వైరీ డీటెయిల్డ్​గా జరిగిన తర్వాత ఆ మహిళ చెప్పేటువంటి విషయాలపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మనం ఏం జరిగింది అనేది పూర్తి క్లారిటీ వస్తుంది.

ఏది ఏమైనా అటువంటి ఇన్సిడెంట్ అమ్మాయిపైన జరగడం బాధాకరం. మహిళపైన జరగడం బాధాకరం. వాళ్ల సిస్టర్ కూడా ఇంకా ఎక్కడ ఉందో ఐడెంటీఫై కాలేదు. ఇద్దరు సిస్టర్స్ వాళ్లు. ఒక మహిళ దొరికింది. ఇంకో మహిళ దొరకలేదు. సో ఆమెను కూడా ఎక్కడుంది అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నరు. టీమ్స్ ఫాం చేస్తా ఉన్నారు. ఒకటి గాంధీ హాస్పిటల్​కు సంబంధించి సూపరింటెండెంట్ గారు ఒకటి వేస్తా ఉన్నారు. డిపార్ట్​మెంటల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. పోలీస్ డిపార్ట్​మెంట్ కూడా ఆ అమ్మాయితో మాట్లాడి ఒక టీంని ఫాం చేయడం జరిగింది. ఇంకోటి సీసీ టీవీ ఫుటేజీని చూడమని ఇంకో టీంని ఫాం చేశారు. డిఫరెంట్ ఆంగిల్స్​లో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. అసలు విషయం తెలుసుకోవడం జరుగుతుంది. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. - సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

నిందితుడు దురుసుగా ప్రవర్తించేవాడు..

ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉమామహేశ్వర్ డార్క్‌రూం అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం రేడియాలజీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న అతడు... విధులకు సరిగా హాజరు కాకపోగా దురుసుగా ప్రవర్తించేవాడని తోటి ఉద్యోగులు తెలిపారు. ఈనెల 5వ తేదీన బాధితులకు సంబంధించిన వ్యక్తి ఆస్పత్రిలో చేరగా.. 11 వ తేదీన రోగికి డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. రోగి తరఫు వారు డయాలసిస్‌ వద్దని... ఈనెల 12వ తేదీన ఆస్పత్రి నుంచి వైద్యులకు చెప్పకుండానే వెళ్లిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగి వివరాలు, అతడికి సహాయకులుగా వచ్చినవారి గురించి సునీతా లక్ష్మారెడ్డి ఆరా తీశారు.

ఇదీ చూడండి: Gandhi Hospital Rape: గాంధీలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.