Conservation of Rivers: ప్రజలు, ప్రభుత్వాల్లో నదులపై అవగాహన కల్పించి వాటి పరిరక్షణకు పాటుపడేలా విస్తృత కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, భారత ద్వీపకల్ప నదీ పరీవాహక ప్రాంత మండలి ఛైర్మన్ వి.ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించనున్న నదుల పరిరక్షణ జాతీయ సదస్సు కరదీపికలను విడుదల చేశారు.
హిమాలయాల నుంచి దక్షిణ భారతదేశం వరకు నదులు, జల వనరుల సంరక్షణకు కృషి చేసిన 200 మంది నిపుణులు సదస్సులో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ‘నదుల ఎజెండా (రివర్ మేనిఫెస్టో)’కు రూపకల్పన చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ముందు పెడతామన్నారు.
ఇదీ చదవండి: