ETV Bharat / state

'భాజపా మెడికల్​ పోర్టల్​ను సద్వినియోగం చేసుకోవాలి' - బీజేపీ మెడికల్​ పోర్టల్​ను ప్రారంభించిన మంత్రి కిషన్​ రెడ్డి

కొవిడ్​-19ను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. కొన్ని నగరాలు, పట్టణాల్లో పాజిటివ్​ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్న ఆయన.. లాక్‌ డౌన్‌కు కొందరు సహకరించడం లేదని పేర్కొన్నారు. స్వీయ నిర్బంధం చేసుకుంటే మన కుటుంబసభ్యులను కాపాడుకోగలమని స్పష్టం చేశారు.

'భాజపా మెడికల్​ పోర్టల్​ను సద్వినియోగం చేసుకోవాలి'

author img

By

Published : Apr 25, 2020, 3:11 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని నగరాలు, పట్టణాల్లో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు భాజపా మెడికల్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ పోర్టల్‌ను కిషన్‌ రెడ్డి ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను సికింద్రాబాద్‌ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

"కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు అంకితభావంతో పని చేస్తున్నాయి. కేంద్ర అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పంపింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి సలహాలిచ్చేలా ఈ బృందం పనిచేస్తోంది. కేంద్రం మినహాయింపులిచ్చినా.. రాష్ట్రం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ చేసింది. సికింద్రాబాద్‌లో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తుంటారు. ఆరోగ్య సేతు యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరచాలి. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆరోగ్య సేతు యాప్‌ చెబుతుంది. మీరున్న ప్రాంతంలో కరోనా ఉంటే ఆరోగ్య సేతు యాప్ అలర్ట్ చేస్తుంది. ప్రజాసేవకు ముందుకు వచ్చిన వైద్యులకు అభినందనలు."

-కిషన్‌ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి

'భాజపా మెడికల్​ పోర్టల్​ను సద్వినియోగం చేసుకోవాలి'

ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.