కరోనా నివారణకు సీఎం సహాయనిధికి రాష్ట్ర సీడ్స్‌మెన్ అసోసియేషన్ 3 కోట్లు రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఇందులో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి 1.16 కోట్ల చెక్కు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు 1.70 కోట్ల చెక్కును సీడ్స్‌మెన్ అసోషియేషన్ తరఫున అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు ఏఎస్‌ఎన్ రెడ్డి అందజేశారు.
త్వరలోనే రూ.14లక్షలు...
మిగతా 14 లక్షలు వివిధ జిల్లాల నుంచి రాగానే అందజేస్తామని వివరించారు. ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన సీడ్స్‌మెన్ అసోసియేషన్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో అసోషియేషన్ సభ్యులు ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.