రాష్ట్ర ప్రభుత్వం రజకుల సమస్యలను పరిష్కరించాలని శాసనమండలి మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో... రజక వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. చేతి వృత్తులను ఆధునీకరించి, ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రజకుల అభివృద్ధికి బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. అందరికీ రుణాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు. రజకులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని... సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌కు వాలంటీర్ల ఉత్సాహం