VRO State Level Meeting: తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారులను వేరే శాఖలో సర్దుబాటు చేస్తే అన్యాయం జరుగుతుందని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పేర్కొన్నారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. శాసనసభలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం చెప్పారు.. అదే విధంగా తమ పట్ల సానుకూలంగా స్పందించాలని సతీష్ కోరారు.
వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సమానమైన హోదాలో కొనసాగించాలని కోరారు. ఒక వేళ కొంత మంది వేరే శాఖలోకి వెళ్లడానికి ఒప్పుకుంటే వారిని నేరుగా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించాలన్నారు.
లేనిపక్షంలో ఆ శాఖలో ఉన్న ఉద్యోగులు, వీఆర్వోల మధ్య ఇబ్బందులు వస్తాయని తెలిపారు. వీఆర్వోల సీనియార్టీ , ఇతర సర్వీసులకు భంగం కలుగుతుందని సతీష్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Half day schools In Telangana: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు