తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌడ కులస్థుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర గౌడ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఉమ్మడి పాలనలో గౌడ కులస్థులు అనేక కష్టాలు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మారాయని చెప్పారు. ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతగా... ఈ నెల 4న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు గౌడ్ తెలిపారు.
కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు - ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు
నీరా పాలసీ ప్రకటించినందుకు రాష్ట్ర గౌడ సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ నెల 4న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లను సన్మానిస్తున్నట్లు వెల్లడించింది.
![కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు State Gowda community thanks Chief Minister KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5573436-978-5573436-1577974250125.jpg?imwidth=3840)
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌడ కులస్థుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర గౌడ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఉమ్మడి పాలనలో గౌడ కులస్థులు అనేక కష్టాలు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మారాయని చెప్పారు. ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతగా... ఈ నెల 4న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు గౌడ్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గౌడ సంఘం కృతజ్ఞతలు
Date : 02-01-2020
TG_Hyd_34_02_Gouda Sangham On Felicitate Ktr_Ab_TS10005
Note: Feed Etv Bharat
Contributor: Bhushanam
యాంకర్ : తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటివరకు ఏ పాలకులు చేయని కులసంఘాల లబ్దికి... ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం హర్షం వ్యక్తం చేసింది. గౌడ కులస్తుల సంక్షేమంలో భాగంగా ఇటీవల నీరా పాలసీని ప్రకటించిన సీఎం కేసిఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతాపూర్వకంగా... ఈ నెల 4న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎక్సైజు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో ఈ సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా... హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని గౌడ హాస్టల్ లో ఆత్మీయ సన్మాన సభ కు సంబంధించిన కరపత్రాలు విడుదల చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు గౌడ కులస్తులను అనేక కష్టాల పాలు చేశారని... హైదరాబాద్ లో కల్లు దుకాణాలు కూడా మూసివేసరని లక్ష్మణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ఆరేళ్ళలోనే గౌడ కులస్తుల జీవితాలలో పెనుమార్పును తీసుకువచ్చిందన్నారు. కల్లు దుకాణాలు తెరిపించడం... హరితహారంలో భాగంగా ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లను పెంచడం, చెట్టు పై నుండి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారని తెలిపారు. అలాగే గౌడ భవనానికి కూడా స్థలం కేటాయించారని తెలిపారు. గౌడ కులస్తులంతా పెద్ద ఎత్తున హాజరై... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్లె లక్ష్మణ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
బైట్ : పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ( తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు )