ETV Bharat / state

నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే: భట్టి విక్రమార్క - భట్టి విక్రమార్క వార్తలు

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఉద్యోగం లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన నిరుద్యోగభృతి హామీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

state government should give Unemployment benefit bhatti vikramarka
నిరుద్యోగభృతి ఇవ్వాల్సిందే: భట్టి విక్రమార్క
author img

By

Published : Jan 21, 2021, 3:27 PM IST

Updated : Jan 22, 2021, 4:43 AM IST

తెలంగాణలో తెరాస ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. నిరుద్యోగ భృతి హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు పాలనను గాలికొదిలేసి కేటీఆర్‌ సీఎం అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకునేది ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని.. ముఖ్యమంత్రులను మార్చుకోవడం కోసం కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు అనేది ఆ పార్టీ అంతర్గత విషయమని భట్టి వ్యాఖ్యానించారు. రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరంపై రూ.లక్ష 15 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ప్రాజెక్టులపై అంచనాలు పెంచుకుంటూపోతున్నారని ఆరోపించారు. గోదావరి ద్వారా చుక్కనీరు కూడా తరలించలేకపోయారని విమర్శించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బడాయి మాటలు మాట్లాడుతున్నారని.. ఉత్తిత్తి కబుర్లు కాకుండా చేతల్లో చూపాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న భాజపా...దర్యాప్తు సంస్థలన్నింటినీ చేతులో పెట్టుకుని ఏమి చేయడం లేదని ఆరోపించారు.

నిరుద్యోగభృతి ఇవ్వాల్సిందే: భట్టి విక్రమార్క

ఇదీ చదవండి: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది : కేటీఆర్

Last Updated : Jan 22, 2021, 4:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.