ETV Bharat / state

నిధుల కోత ప్రభావం.. రాష్ట్ర బడ్జెట్​పై పడనుందా? - రాష్ట్ర బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న సర్కారు

పదిశాతం వరకు వృద్ధితో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి ప్రత్యేకించి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో కోత ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై స్పష్టంగా పడనుంది. ఉన్న ఆర్థిక వనరులు, ఆదాయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహకార ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.

State government exercise on budget
నిధుల కోత ప్రభావం.. రాష్ట్ర బడ్జెట్​పై పడనుందా?
author img

By

Published : Feb 4, 2020, 6:02 AM IST

నిధుల కోత ప్రభావం.. రాష్ట్ర బడ్జెట్​పై పడనుందా?

కేంద్ర వార్షిక బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే నిధులకు సంబంధించి స్పష్టత వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పెద్దగా ఏమీ ప్రయోజనం చేకూర్చని కేంద్ర ప్రభుత్వం... రావాల్సిన నిధుల్లోనూ.. కోత విధించింది. కేంద్ర పన్నుల రాష్ట్ర వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రంపై ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మూడు వేల కోట్లకు పైగా నిధులు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నిధులు ఏ మేరకు వస్తాయోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

బాగా తగ్గనున్న నిధులు..

15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు కూడా బాగా తగ్గనున్నాయి. ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక అయినప్పటికీ.. భవిష్యత్​లో వచ్చే పూర్తి స్థాయి నివేదికలోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే అంటున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలోనూ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు అంతంతమాత్రంగానే రావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల్లో కోత వేయడం ఏ మాత్రం సబబు కాదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గుజరాత్ లాంటి రాష్ట్రాలకు మాత్రం యధాతథంగా నిధులు ఇస్తూ మన రాష్ట్రానికి తగ్గించడం ఏ మేరకు సబబని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర బడ్జెట్​పై ప్రభావం..

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోగా... మళ్లీ తగ్గడం రాష్ట్ర ప్రణాళికలకు ఇబ్బంది కలిగించనుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన స్పష్టత వచ్చిన నేపథ్యంలో వాటి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ సిద్ధం కానుంది. సహకార ఎన్నికలు ముగిశాక రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇందువల్ల బడ్జెట్ కసరత్తు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి.

సీఎం సమీక్ష..

కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర ఆదాయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. కీలకమైన నీటిపారుదల శాఖ బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన అవసరాలు, ప్రతిపాదనలు, ఇతర వనరులు తదితర అంశాలపై సమీక్షించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ కన్నా 20 శాతం తగ్గించి కేవలం లక్షా 36వేల కోట్ల రూపాయలతోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. భూముల అమ్మకం ద్వారా మరో 10 వేల కోట్ల రూపాయలు రాబట్టుకోవాలని ప్రణాళికలు రచించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు.

పది శాతం వృద్ధి ఉండొచ్చు..

ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం, నిధులను పరిగణలోకి తీసుకొని చివరి త్రైమాసికం అంచనాల ఆధారంగా వచ్చే ఏడాది రాబడులను అంచనా వేయనున్నారు. ప్రస్తుత ఆదాయంతో పోలిస్తే వచ్చే ఏడాది పది శాతం వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. లక్షా 36వేల కోట్లకు అదనంగా మరో 14వేల కోట్ల వరకు కలిపి... లక్షన్నర కోట్ల రూపాయల మార్కు అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారంగానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉండవచ్చని అంటున్నారు. అన్ని శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో సమీక్షించి బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి:- నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.