ETV Bharat / state

పురపాలక ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూసుకున్నారా? - municipal elections date in telangana 2019

త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలకు ఓటర్లు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్లున్నాయో లేదో చూసుకొమ్మంటోంది. ఒకవేళ లేనట్లయితే... నమోదు చేసుకోవాలని చెబుతోంది. ఏవైనా ఇబ్బందులున్నా అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కరించుకొని ఓటు హక్కును ఉపయోగించుకోవాలంటోంది ఎన్నికల సంఘం.

STATE ELECTION COMMISSION INSTRUCTED TO VOTERS FOR MUNICIPAL ELECTIONS IN TELANGANA
author img

By

Published : Oct 25, 2019, 9:32 PM IST

పురపాలక ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూసుకున్నారా?

రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన నగర పాలక సంస్థ, పురపాలక సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పురపాలక ఎన్నికల దృష్ట్యా... అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవాలని సూచించింది. 2019 జనవరి ఒకటి వరకు అర్హత పొందిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. జులై 16న ఫొటో ఓటర్ జాబితాలను ప్రకటించినట్లు పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్​సైట్ tsec.gov.in లో ఓటు వివరాలు సరిచూసుకోవాలని సూచించింది. ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే పురపోరులో ఓటుహక్కు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఈ కథనం చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.