ETV Bharat / state

వడ్డీతో సహా రూ.16 లక్షలు కట్టాల్సిందే..!!

వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ చిన్నారి తన అరచేతిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన 19 ఏళ్ల క్రితం జరిగింది. ఆమె 20 ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం దక్కింది. వడ్డీతో సహా రూ. 16 లక్షలు కట్టాల్సిందేనని... వైద్యుడికి, బీమా సంస్థకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

20 years of legal battle
ఫలించిన 20 ఏళ్ల న్యాయపోరాటం
author img

By

Published : May 17, 2022, 7:29 AM IST

జ్వరం నయమవడానికి తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించడంలో జరిగిన పొరపాటుకు జ్వరం తగ్గే మాట దేవుడెరుగు గానీ.. ఆ చిన్నారి అరచేతినే కోల్పోయింది. తోటి మిత్రులతో ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ ఆనందంగా గడపాల్సిన ఆ బాలిక నాలుగేళ్ల ప్రాయంలోనే వైకల్యం పొందగా.. సుమారు 20 ఏళ్లపాటు పోరాటం చేస్తేగానీ ఆమెకు న్యాయం దక్కలేదు.

ఎట్టకేలకు బాధితురాలికి తగిన పరిహారాన్ని వడ్డీ సహా చెల్లించాల్సిందేనంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తాజాగా తీర్పునిచ్చింది. సెలైన్‌ అందించడానికి ఇంజక్షన్‌ పైపును సరిగా అమర్చకపోవడంతో అంగవైకల్యం పొందిన బాధితురాలికి వైద్యుడు, బీమా సంస్థ 2016 సెప్టెంబరు నుంచి రూ.16 లక్షల పరిహారాన్ని 7 శాతం వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది. వైద్యుడి నిర్లక్ష్యంతో 19 ఏళ్ల క్రితం చేతిని కోల్పోయిన బాధితురాలికి ఇప్పటివరకు పరిహారం అందించకపోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేసింది. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన డి.రమేష్‌బాబు జ్వరంతోపాటు బాధపడుతున్న తన నాలుగేళ్ల కుమార్తె సౌమ్యను 2003లో హనుమకొండ అమృత నర్సింగ్‌ హోంలోని డాక్టర్‌ జి.రమేష్‌ వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు చికిత్స అందించి రెండు రోజుల తరువాత డిశ్ఛార్జి చేశారు. అనంతరం సెలైన్‌ ఎక్కించడానికి ఇంజెక్షన్‌ ఇచ్చిన కుడి చేయికి వాపు వచ్చి నొప్పి పెరిగిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తిరిగి వైద్యుడిని సంప్రదించగా.. హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు డాక్టర్‌ వద్దకు వెళ్లాలని సిఫారసు చేశారు.

ప్రైవేటులో చికిత్స చేయించే స్తోమత లేక వారు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యులు ఇన్ఫెక్షన్‌కు గురైన అరచేతిని తొలగించారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే తన కుమార్తెకు అంగవైకల్యం ఏర్పడిందంటూ డి.రమేష్‌బాబు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. విచారించిన జిల్లా ఫోరం.. బాధిత కుటుంబానికి వైద్యుడు, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ సంయుక్తంగా గానీ, విడివిడిగా గానీ రూ.16 లక్షల పరిహారం చెల్లించాలని 2016లో తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ జి.రమేష్‌, ఇన్సూరెన్స్‌ సంస్థ ప్రతినిధులు విడివిడిగా రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యులు మీనారామనాథన్‌, కె.రంగారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాధిత కుటుంబం పక్షాన న్యాయవాది వి.గౌరీశంకరరావు వాదనలు వినిపించారు. వాదనలను విన్న ధర్మాసనం.. సెలైన్‌ ఇవ్వడానికి అమర్చాల్సిన పైపు విషయంలో డాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారణకు వచ్చింది. జిల్లా ఫోరం తీర్పును సవరించి.. వైద్యుడి, బీమా సంస్థ అప్పీళ్లను కొట్టివేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.