ETV Bharat / state

ఏకాభిప్రాయం కోసం అధిష్ఠానం వ్యూహం

పట్టభద్రుల మండలి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయానికి కృషి చేస్తోంది. 50 మందికిపైగా నాయకులు రెండు మండలి స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నా.. ఆరేడుగురి పేర్లనే పరిశీలిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చర్చించిన సీనియర్​ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జితో మరోసారి మాట్లాడి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

state congress discuss about graduate mlc elections
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్​ దృష్టి
author img

By

Published : Jan 20, 2021, 10:43 AM IST

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ రెండు పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు 54 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ మండలి స్థానానికి 29 మంది, నల్గొండ మండలి స్థానానికి 25మంది లెక్కన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో సమర్ధులైన నాయకుల పేర్లను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది. పలుమార్లు అంతర్గత సమావేశాలు నిర్వహించిన నేతలు.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తున్నారు.

రెండు చోట్ల పేరిచ్చిన శ్రవణ్​

మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్‌, వంశీచంద్‌ రెడ్డి, హర్షవర్దన్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌, నల్గొండ గ్రాడ్యుయేట్‌ మండలి స్థానానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌, మానవతారాయ్‌, బెల్లయ్యనాయక్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. దాసోజు శ్రవణ్‌కుమార్‌ రెండింటిలో ఎక్కడిచ్చిన పోటీ చేస్తానని పేర్కొంటూ రెండు దరఖాస్తులు ఇచ్చారు.

కలిసికట్టుగా కృషి చేయాలి

సోమవారం జానారెడ్డి నివాసంలో సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి బోసు రాజు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏకాభిప్రాయం తీసుకురావాలని నిర్ణయించారు. ఎవరు పోటీ చేసినా.. వారి గెలుపునకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఏవిధంగా అయితే రాష్ట్ర నాయకత్వం అంతా కలిసికట్టుగా పని చేసిందో.. అంతకంటే ఎక్కువగా చేయాలని... పార్టీపై శ్రేణుల్లో విశ్వాసం పెంచాలన్నారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఉచిత తాగునీటి పథకంలో చిరు జలక్‌... అప్పడే వర్తిస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.