cabinet meet: ధాన్యం కొనుగోళ్ల అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ వేదికగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. యాసంగి సీజన్ వరిధాన్యం కొనుగోళ్ల అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం, తెరాస నాయకులు గ్రామస్థాయి నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే లేఖ రాశారు.
ఇవాళ దిల్లీ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోపోతే తామే ధాన్యం కొనుగోళ్ల విషయమై తామే ఓ నిర్ణయానికి వస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. అందుకు అనుగుణంగా రేపు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం తీసుకోపోతే ముడిబియ్యంగా మారిస్తే వచ్చే వ్యత్యాసాన్ని భరించడం, ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయించడం తదితర ప్రత్యామ్నాయాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
హైదరాబాద్ రానున్న కేసీఆర్: పది రోజుల దిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరనున్నారు. ఈరోజు దిల్లీలోని తెలంగాణ భవన్లో చేపట్టిన దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి పది రోజులపాటు పర్యటించారు.
ఇదీ చూడండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. తెలంగాణ ధాన్యం కొనండి'