రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం... క్రైస్తవులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేచ్చలేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. మాయమాటలు చెప్పి క్రైస్తవులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్న సీఎం కేసీఆర్... మొదటగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇమామ్‌లకు ఇస్తున్నట్లుగా ఫాదర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, మిషనరీ భూముల పరిరక్షణకు చట్టం తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీలను మరుగున వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్, జడ్చర్ల సీఎస్‌ఐ భూములను కేటీఆర్ సన్నిహితులు కబ్జా చేశారని సంపత్ కుమార్ ఆరోపించారు.
ఇవీ చూడండి: నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..