ETV Bharat / state

శ్రీశైలంకు నిలకడగా ప్రవాహం... సాయంత్రం నీటి విడుదల..! - srisailam

శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరటం వల్ల నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. సాయంత్రానికి పూర్తి స్థాయిలో డ్యాం నిండితే... గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ తెలిపారు.

శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం
author img

By

Published : Aug 9, 2019, 9:03 AM IST

Updated : Aug 9, 2019, 10:16 AM IST

srisailam-flood-continue
శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం 3.59 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం 879.1 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలుగా ఉండగా... ప్రస్తుతం 183 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,272 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1,351 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకు 20 వేల క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి స్థాయిలో జలాశయం నిండే అవకాశం ఉన్నందున... సాయంత్రం 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నామని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: శ్రీశైలం జలాశయంలో స్థిరంగా నీటిమట్టం

Intro:ap_knl_22_30_varsham_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా మహనందిలో వడగళ్ల వాన కురిసింది. అరగంటకు పైగా ఈదురు గాలులు వాన కురిసింది. వర్షం కురవడంతో జనం ఉపశమనం పొందారు ఈదురు గాలులకు నంద్యాలలో పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీనితో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది

Body:వాన

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Aug 9, 2019, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.