Srinivas goud About Arts : తెలంగాణలో ప్రాచీన కళల పరిరక్షణకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, కళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 25న రవీంద్రభారతిలో నిర్వహించనున్న సృజనోత్సవ్- 2022 లోగోను హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ఆవిష్కరించారు.
సృజనోత్సవ్ పేరిట విద్యార్థులకు కళల పట్ల అవగాహన కల్పించేందుకు మ్యూజిక్, చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సాహిస్తున్నందుకు స్వార్ మహతి కళా పరిషత్‌ను మంత్రులు అభినందించారు.
ఇదీ చదవండి : Jaggareddy on resign: 'కాంగ్రెస్‌కు రాజీనామాను వాయిదా వేసుకుంటున్నా'