ETV Bharat / state

srinivas goud: 'అభివృద్ధి చేసే పార్టీకి.. అభివృద్ధిని అడ్డుకునే పార్టీకి పోటీ'

సీఎం కేసీఆర్‌(CM KCR)పై ఈటల చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌(srinivas goud) అన్నారు. కేసీఆర్‌, ఈటలకు ఆరేళ్లుగా గ్యాప్ ఉంటే మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్, తెరాస లేకుంటే ఈటల ఎక్కడ ఉండే వారని ఎద్దేవా చేశారు. ఈటల తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సీఎంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

srinivas goud fires on etela
srinivas goud: 'అభివృద్ధి చేసే పార్టీకి.. అభివృద్ధిని అడ్డుకునే పార్టీకి పోటీ'
author img

By

Published : Jun 12, 2021, 7:52 PM IST

Updated : Jun 12, 2021, 8:58 PM IST

తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్​పై(CM KCR) ఈటల రాజేందర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్(srinivas goud) ఆరోపించారు. అన్నం పెట్టిన పార్టీని విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్, తెరాస లేకపోతే ఈటల ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు. కేసీఆర్, తెరాస లేకుండానేనే ఈటల తన పేరుతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా అని ప్రశ్నించారు. పార్టీలోకి రాకముందు... వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తనతో గ్యాప్ ఉన్నప్పటికీ కేసీఆర్(CM KCR) మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని... ఐదేళ్లుగా పక్కన పెట్టినప్పటికీ ఈటల మారలేదన్నారు.

తనకు నచ్చని పార్టీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఈటల ఆలోచించుకోవాలని శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. వరవరరావును జైళ్లో పెడితే కేసీఆర్(CM KCR) పరామర్శించలేదంటున్న ఈటల... ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలన్నారు. ఈటల రాజేందర్ నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్(srinivas goud) ధ్వజమెత్తారు. హుజురాబాద్​లో అభివృద్ధి చేసే పార్టీకి... అభివృద్ధిని అడ్డుకునే పార్టీకి మధ్య పోటీ అని మంత్రి(srinivas goud) అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని భాజపాలో చేరబోతున్న ఈటల... పెట్రోలు ధరలు తగ్గిస్తారా లేక రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు తెప్పిస్తారా అని ఎద్దేవా చేశారు. భాజపా భూ స్థాపితం అవుతుందన్న ఈటల... ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలన్నారు.

srinivas goud: 'అభివృద్ధి చేసే పార్టీకి.. అభివృద్ధిని అడ్డుకునే పార్టీకి పోటీ'

ఇదీ చూడండి: ponnam prabhakar: 'ఆ 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి'

Last Updated : Jun 12, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.