ETV Bharat / state

ప్రాజెక్టులపై రాజకీయాలు తగవు: మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌

author img

By

Published : Jul 3, 2020, 6:51 PM IST

Updated : Jul 3, 2020, 6:59 PM IST

ప్రాజెక్టులపై రాజకీయాలు తగవు అని ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టులకు గండి పడలేదన్నట్లు... ప్రతిపక్షాలు పెద్ద రాద్దాంతం చేస్తున్నాయని పేర్కొన్నాయి. తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు.

minister srinivas goud fire on  Oppositions in state in media conference at hyderabad
ప్రాజెక్టులపై రాజకీయాలు తగవు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్రతి ఒక్కరూ గర్వపడాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రాన్ని తెచ్చిన మా ప్రభుత్వంపై విమర్శలా? అని అన్నారు. కొండ పోచమ్మ ప్రాజెక్టు చిన్న కాలువకు గండి పడితే అదొక వింత అన్నట్టుగా కాంగ్రెస్, భాజపా రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. గండ్లు కాలువలకు ,చెరువులకు పడకపోతే మనుషులకు పడతాయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి ‌మీడియా సమావేశం నిర్వహించారు.

ఎక్కడో ఓ చోట చిన్న గండి పడితే ... దాన్నీ ప్రతిపక్షాలు భూతద్దంలో చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. 70 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసివాళ్లు, ప్రత్యేక తెలంగాణ రాకుండా అడ్డుకున్న వాళ్లు ఈ రోజు గండి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా గండి కొట్టని ప్రాజెక్టులు ఉంటాయా ?. కొత్త ప్రాజెక్టుల్లో గండ్లు పడటం సహజం... గండి పడితే మళ్లీ గండి పూడుస్తాం అని వివరించారు.

కాంగ్రెస్ హాయంలో కాలువలే తవ్వలేదు కాబట్టి.. గండ్లు కూడా పడలేదన్నారు. సైన్యంలో పని చేసిన ఉత్తమ్.. జ్ఞానం పెంచుకుని మాట్లాడాలన్నారు. పొలిటికల్ టూరిస్టుగా వచ్చిన రామ్ మాధవ్.. సగం సగం ప్రాజెక్టులు కట్టారని అర్ధ రహితంగా మాట్లాడారని మంత్రి ఆరోపించారు. కేసీఆర్​కు కొండ పోచమ్మ కాలువ గండికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కాలువలకు గండికి.. అప్పుడు సీఎంగా ఉన్న మోదీది తప్పా అని మంత్రి ప్రశ్నించారు.

కేసీఆర్​ను ప్రజలు ఇంటికి సాగనంపే రోజు దగ్గర్లోనే ఉందని రామ్ మాధవ్ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రతి ఎన్నికలో భాజపానే ప్రజలు ఇంటికే పంపారని.. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే తప్ప రామ్ మాధవ్ కాదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులే కట్టలేదంటున్న రాం మాధవ్ శాటిలైట్ మ్యాపులు తెప్పించుకుని చూడాలన్నారు.

ప్రాజెక్టులపై రాజకీయాలు తగవు: మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌

ఇదీ చూడండి: 'ప్రజా ప్రతినిధులు మీరే ఇలా ఉంటే... సామాన్యులు ఎలా పాటిస్తారు?'

Last Updated : Jul 3, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.