ETV Bharat / state

SRI RAMA NAVAMI: బెల్జియంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణం - sri ramanavami celebrations in other countrys

శ్రీరామ నవమి వేడుకలను బెల్జియంలో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారంతా ఓచోట చేరి.. కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణాన్ని జరిపించారు. భక్తుల జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.

బెల్జియంలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం

author img

By

Published : Apr 12, 2022, 7:15 AM IST

బెల్జియంలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీరామ నవమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. శ్రీ రామ నామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం శ్రీరామ నవమిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెల్జియంలో తెలుగు వారంతా ఓ చోట చేరి.. శ్రీరామ నవమిని ఉత్సాహంగా జరుపుకున్నారు. సీతారామచంద్రులకు వైభవంగా కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ రామ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.

శ్రీ రామనవమి తర్వాత రోజున పుష్యమి సందర్భంగా రామయ్యకు పట్టాభిషేకం సైతం ఘనంగా జరిపించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, ఆటపాటలతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఎప్పుడూ తమ తమ పనుల్లో బిజీగా ఉండే వారంతా.. శ్రీ రామనవమి సందర్భంగా అంతా ఓచోట చేరి కాసేపు ఉల్లాసంగా గడిపారు.

ఇవీ చూడండి:

Bhadradri Ramaiah Coronation Ceremony: రామయ్యకు మహాపట్టాభిషేకం.. పులకించిన భద్రాద్రి

'బదిలీ కావాలంటే భార్యను పంపించు'.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.