ETV Bharat / state

నానాజీ దేశ్​ముఖ్​ నవ దాదీచి: బండారు దత్తాత్రేయ - నానాజీ దేశ్​ముఖ్​ జయంతి వేడుకలు

సరస్వతీ శిశుమందిరాల స్థాపకులు, భారత రత్న, విద్యావేత్త నానాజీ దేశ్​ముఖ్ జయంతి వేడుకలు హిమాచల్​ ప్రదేశ్​లో నిర్వహించారు. ఆన్​లైన్​ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని నివాళి అర్పించారు. నానాజీ దేశ్​ముఖ్​ సేవలను కొనియాడారు.

నానాజీ దేశ్​ముఖ్​ నవ దాదీచి: బండారు దత్తాత్రేయ

author img

By

Published : Oct 11, 2020, 8:50 PM IST

విద్యతో పాటు సదాచారం, సంస్కారం, సామాజిక, నైతిక విలువలు పెంపొందించడంలో... శిశుమందిర్​లు నానాజీ స్పూర్తితో నేటికీ పనిచేస్తున్నాయని హిమాచల్​ ప్రదేశ్ గవర్నర్​ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సరస్వతీ శిశుమందిరాల స్థాపకులు, భారతరత్న నానాజీ దేశ్​ముఖ్​ జయంతి వేడుకలను హిమాచల్​ ప్రదేశ్​లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

"ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు" అనే నినాదంతో వందలాది గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత నానాజీ దేశ్ ముఖ్​కు చెందుతుందని కొనియాడారు. నానాజీ దేశముఖ్ రాజర్షి అని... ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప విషయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం అవయవాలన్నీ ఎయిమ్స్​ ఆస్పత్రికి అందించారని గుర్తుచేసుకున్నారు. నానాజీని నవ దాదీచిగా దత్తాత్రేయ అభివర్ణించారు.

ఇదీ చూడండి: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.