కరోనా కష్టకాలంలో మేమున్నామంటూ ముందుకొచ్చారు శ్రీ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ట్రస్ట్ సభ్యులు నందకిషోర్ వ్యాస్, పరమేశ్వరి సింగ్ అర్హులైన 200 మందికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం అందించారు. అలాగే 2వేల ఎన్ 95 మాస్క్ లను పంపిణీ చేసి తమ గొప్ప మనుసును చాటుకున్నారు.
ఈ సహాయక చర్యలు ప్రతి రోజు గోషామహల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని అన్నారు. ఈ కష్ట సమయంలో పేద ప్రజలకు అండగా ఉంటామని నందకిషోర్ వ్యాప్ తెలిపారు.
ఇదీ చూడండి: ఆంక్షలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్