ETV Bharat / state

తెలంగాణలో ఉద్యాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు: గవర్నర్

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీగా డా.నీరజ ప్రభాకర్‌ నియమితులైన తర్వాత తొలిసారిగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. విద్యా బోధన, పరిశోధన, విస్తరణ పురోగతి విషయాలను సౌందరరాజన్​కు వివరించారు. విద్యార్థులు ఉద్యానరంగానికి అనుసంధానం అయ్యే రీతిలో కొత్త ఆవిష్కరణలను అన్వేషించాలని గవర్నర్ వీసీకి సలహా ఇచ్చారు

Sri konda Lakshman Telangana State Horticultural University Vc neeraja Met Governor Sundararajan
తెలంగాణలో ఉద్యాన రంగానికి ఉజ్వల భవిష్యత్: గవర్నర్
author img

By

Published : Jan 28, 2021, 8:18 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.నీరజ ప్రభాకర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ వీసీగా నియమితులైన తర్వాత ఆమె తొలిసారిగా గవర్నర్‌ను కలవగా శుభాకాంక్షలు తెలియజేశారు.

స్నాతకోత్సవానికి అనుమతి...

యూనివర్సిటీలో సాగుతోన్న విద్యా బోధన, పరిశోధన, విస్తరణ పురోగతిపై గవర్నర్‌కు వీసీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో అన్ని కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఫిబ్రవరి 1 నుంచి కళాశాలు తిరిగి తెరవడానికి విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని చెప్పారు. మార్చి నెలలో వర్చువల్ వేదికగా శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహిండానికి గవర్నర్ అనుమతి తీసుకున్నారు.

కొత్తవి అన్వేషించాలి...

విద్యార్థులు ఉద్యానరంగానికి అనుసంధానం అయ్యే రీతిలో విద్యా పద్ధతుల్లో కొత్త ఆవిష్కరణలను అన్వేషించాలని ఉపకులపతికి గవర్నర్ సలహా ఇచ్చారు. పోషక విలువలతో కూడిన కొత్త ఉద్యాన పంటలను ప్రవేశపెట్టాలని సూచించారు. తద్వారా రోగనిరోధక శక్తిని పెరుగుతుందని.. మహమ్మారిని అధిగమించడంలో సహాయపడుతుందని చెప్పారు. అన్ని ఉద్యాన పంటలను కలిగి ఉన్న రాజ్‌భవన్ సుందరీకరణకు విశ్వవిద్యాలయం మరింత సహాయం చేయాలని గవర్నర్‌ ఆదేశించారు.

ఇదీ చూడండి: సాగుచట్టాలతో 'పెద్దోళ్ల'కు మేలు.. రైతులకు ఉరితాడు: అమర్జిత్ కౌర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.