ETV Bharat / state

నాసా పోటీలో కూకట్‌పల్లి విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపిక - కూకట్‌పల్లి వార్తలు

'నాసా ‌స్పేస్ సెటిల్మెంట్ కంటెస్టెంట్ 2021' లో కూకట్‌పల్లికి చెందిన ఇద్దరు విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. భారతదేశం నుంచి 107 ప్రాజెక్టులు ఎంపికవగా.. అందులో శ్రీచైతన్య విద్యార్థులవి 64 ప్రాజెక్టులు ఉండటం గర్వకారణమని కూకట్‌పల్లి జోన్ శ్రీచైతన్య పాఠశాల రీజనల్ ఇంఛార్జ్ అనిత‌‌ అన్నారు.

sri chaitanya school news, kukatpally news
కూకట్‌పల్లి శ్రీచైతన్య పాఠశాల, నాసా ‌స్పేస్ సెటిల్మెంట్ కంటెస్టెంట్, కూకట్‌పల్లి
author img

By

Published : Apr 6, 2021, 8:47 PM IST

'నాసా ‌స్పేస్ సెటిల్మెంట్ కంటెస్టెంట్ 2021' లో శ్రీచైతన్య పాఠశాలల నుంచి 64 ప్రాజెక్టులు ఎంపిక కావడం చాలా‌ సంతోషంగా ఉందని కూకట్‌పల్లి జోన్ చైతన్య పాఠశాల రీజనల్ ఇంఛార్జ్ అనిత‌‌ అన్నారు. కూకట్​పల్లి నుంచి ఇద్దరు విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయి. వారిని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరాలని వారు ఆకాంక్షించారు.

మొత్తం 35 దేశాలు ఈ పోటీల్లో పాల్గొనగా.. నాసా 160 ప్రాజెక్టులు ఎంపిక చేసింది. 107 ప్రాజెక్టుల ఎంపికతో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. భారత్​లో ఎంపికైన మొత్తం 107 ప్రాజెక్టుల్లో శ్రీచైతన్య విద్యార్థులవి 64 ప్రాజెక్టులు ఉండటం విశేషం.

ఈ 64 ప్రాజెక్టుల్లో కూకట్‌పల్లి నుంచి ఎంపిక అయిన నిహారిక, సుచిత ప్రాజెక్టులు.. మూడవ స్థానంలో నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు కోమలి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బొడిగ శోభపై ఏపీ తెరాస నేత మండిపాటు.. విజయవాడ సీపీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.