ETV Bharat / state

మరో యువతితోనూ దేవరాజ్​ ప్రేమాయణం - సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు తాజా వార్తలు

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్​ మరో యువతితోనూ ప్రేమాయణం కొనసాగించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సదరు యువతి బావ శేఖర్‌... దేవరాజ్​తో వాగ్వాదానికి దిగిన ఫోన్‌ సంభాషణ వెలుగులోకి వచ్చింది. దేవరాజ్​, సాయి కృష్ణారెడ్డి మధ్య జరిగిన గొడవ.. శ్రావణితో ఆమె కుటుంబ సభ్యులతో ఉన్న పరిచయం గురించి పోలీసులు సాయి కృష్ణారెడ్డిని శనివారం ప్రశ్నించే అవకాశం ఉంది.

మరో యువతితోనూ దేవరాజ్​ ప్రేమాయణం
మరో యువతితోనూ దేవరాజ్​ ప్రేమాయణం
author img

By

Published : Sep 12, 2020, 5:02 AM IST

మరో యువతితోనూ దేవరాజ్​ ప్రేమాయణం

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్​ మరో యువతితోనూ ప్రేమాయణం కొనసాగించాడు. దీనికి సంబంధించి సదరు యువతి బావ అయిన శేఖర్​కు దేవరాజ్​కు ఫోన్ సంభాషణలో వాగ్వాదం జరిగింది. ఓవైపు శ్రావణిని ప్రేమిస్తూ మరోవైపు యువతితో సన్నిహితంగా ఉండడాన్ని శేఖర్ ప్రశ్నించాడు. ఇలా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన ఫోన్ సంభాషణలు బయటికి వచ్చాయి.

హైదరాబాద్​ ఎస్సాఆర్​ పోలీసులు ప్రస్తుతం దేవరాజ్​ను శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. శ్రావణి ఆత్మహత్య విషయంలో సాయి కృష్ణారెడ్డి అనే యువకుడి పేరుతో పాటు ఓ సినీ నిర్మాత పేరు కూడా దేవారాజ్ చెప్పడం వల్ల వారిద్దరిని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. సాయి కృష్ణారెడ్డిని స్టేషన్​కు రావాల్సిందిగా పోలీసులు సమాచారం పంపగా శనివారం వస్తానని అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దేవరాజ్​, సాయి కృష్ణారెడ్డి మధ్య జరిగిన గొడవ.. శ్రావణితో ఆమె కుటుంబ సభ్యులతో ఉన్న పరిచయం గురించి పోలీసులు సాయి కృష్ణారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. చనిపోయే ముందు రోజు శ్రావణి కుటుంబంలో జరిగిన గొడవకు సంబంధించిన కారణాలను పోలీసులు తెలుసుకొనున్నారు.

ఇదీ చదవండి: బుల్లితెర నటి శ్రావణి కేసులో ఆసక్తికర విషయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.