కరోనా ప్రభావంతో రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన భవన నిర్మాణ కూలీలు భాగ్యనగరంలోనే చిక్కుకుపోయారు. వారి బాగోగులు చూసుకోవాల్సిన కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం వల్ల ఎస్ ఆర్‌నగర్ పోలీసులు వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు.
ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని పోలీసులంతా కలిసి 150 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి ఆకలి తీర్చడానికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
భవన నిర్మాణానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపించుకుని, ఆపత్కర సమయంలో వారి బాధలు గాలికొదిలేసిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ సాయినాథ్ తెలిపారు.
- ఇవీ చూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500