Spurious Seeds Rocket In Telangana : తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు నాసిరకం విత్తనాల బెడద తొలగడం లేదు. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మించి కొందరు వ్యాపారులు అన్నదాతల్ని నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. వీటితో ఏటా దాదాపు 3 లక్షల మంది రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఏటా 50 లక్షలకు పైగా క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఇక్కడ ప్రధాన పంట వరి కాగా.. పత్తి, మొక్కజొన్న, మిరప తదితర పంటలు సాగవుతున్నాయి. దీనినే ఆసరాగా చేసుకుంటున్న నకిలీ వ్యాపారులు.. ఈ పంటలకు సంబంధించిన నకిలీకి అమ్ముతున్నారు.
"కొంత మంది ఏజెంట్లను పెట్టుకొని నేరుగా గ్రామాల్లోకి వచ్చి నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. ప్రముఖ కంపెనీల బొమ్మలు చూపించి.. రైతుకు విక్రయిస్తున్నారు. వాటికి రశీదు కూడా ఇవ్వడం లేదు. తక్కువ రేటుకే దళారులు విత్తనాలను రైతులకు అమ్ముతున్నాడు. ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి." - పుట్టా జనార్థన్‌రెడ్డి, ప్రముఖ అభ్యుదయ రైతు, నల్గొండ
Spurious Seeds Rocket Busted : విత్తన భాండాగారంగా అవతరించిన తెలంగాణకు ఎక్కువ మొత్తంలో ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాల నుంచే నాసిరకం విత్తనాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల వద్ద చెక్‌పోస్టులు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన యథేచ్ఛగా చేరుస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి వస్తోన్న విత్తనాలను కొన్ని జిల్లాలకు తరలిస్తున్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాల నుంచి విత్తనాలు అధికశాతం రైళ్ల ద్వారానే రవాణా అవుతున్నట్లు సమాచారం. ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 మంది సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పావని బ్రాండ్ పేరుతో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
" వ్యాపారులు అమ్మే విత్తనాల ప్యాకెట్లపై వాటి తయారీ, ఉత్పత్తి వంటి విషయాలు ఉండి సమగ్ర సమాచారం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ విషయాలను అన్నింటినీ చెక్ చేసుకోవాలి. రైతులకు ఎలాంటి సందేహం వచ్చిన మండలంలోని విత్తన అధికారులు ఉంటారు వారిని సంప్రదించండి. దయ చేసి రైతులు ఈ విషయాలను గమనించగలరు." - గీతా, జిల్లా వ్యవసాయ అధికారి, రంగారెడ్డి
Fake Pesticides in Sangareddy : ప్రభుత్వం యుద్ధం ప్రకటించినా.. ఆగని 'నకిలీ' దందాలు
"18 లక్షల క్వింటాళ్ల విత్తనాలను మనం వినియోగిస్తున్నాం. ఎక్కడి కక్కడ నకిలీ విత్తనాలను నిరోధిస్తున్నాం. పీడీ యాక్టులు కూడా పెడుతున్నాం. రాత్రికి రాత్రే ధనవంతులైపోవాలని చూసే దురాశపరులు ఉంటారు. అలాంటి వారిని నిరోధిస్తున్నాం. చట్టం చాలా కఠినంగా అమలు చేస్తున్నాం."- నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Spurious cotton Seeds Rocket In Telangana : ఈ ఏడాది జూన్1 నుంచే సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. నాసిరకం విత్తనాలను నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్, వరంగల్, పాలెం, జగిత్యాలో విత్తన మేళాల ద్వారా నాణ్యమైన విత్తనాల పంపిణీకి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఈ వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో రకరకాల పంటలు సాగు అవుతున్నాయి.
ఇవీ చదవండి :