Spiritual Day Celebrations in Telangana : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆధ్యాత్మికోత్సవాలు ఘనంగా జరిగాయి. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలుచేశారు. వేడుకల నేపథ్యంలో.. యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల విక్రయం, వెబ్ పోర్టల్, ఆన్‌లైన్ టికెట్ సేవలను మంత్రి ప్రారంభించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజ హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో.. ఆధ్యాత్మిక భావన కలిగిన సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి పరచడంతో పాటు పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తలసాని అన్నారు.
Devotional day in Telangana : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నియోజకవర్గంలోని మందిరం, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని రాజరాజేశ్వరి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపై.. ఎమ్మెల్యే దానం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా కార్పొరేటర్లు సైతం పెద్ద ఎత్తున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. బోనాలు సమర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు మసీదులో ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలోని ధ్యానాంజనేయ స్వామి రథోత్సవ వేడులు కనులవిందుగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించారు.
ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు : ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో.. జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా సాగాయి. ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ఆలయ అధికారులు కనుల పండువగా నిర్వహించారు. ముందుగా సీతారాముల ప్రచార రథంతో నగర సంకీర్తన చేశారు. ఖమ్మం స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు ప్రత్యేక పూజలు, యాగాలు చేశారు. జూలూరుపాడులో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు.
ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో ఆధ్యాత్మిక సౌరభాలు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చితో పాటు, స్థానిక మసీదులో.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం గండి హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హాజరయ్యారు. నియోజకవర్గంలో ధూప దీప నైవేద్య పథకం కింద ఎంపికైన ఆలయ అర్చకులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. మంజూరు పత్రాలు అందించారు. జగిత్యాల జిల్లాలోని శ్రీపార్వతీ కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దూపదీప నైవేద్య అర్చక సంఘం గోదావరి నదికి పూజలు చేసింది. అర్చకులు కోటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు.
ఇవీ చదవండి :