ETV Bharat / state

పండుగ వేళ సిర్పూర్ కాగజ్​నగర్​కు ప్రత్యేక రైళ్లు - సిర్పూర్ కాగజ్​నగర్​కు ప్రత్యేక రైళ్లు

దసరా పండగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తాజాగా సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్​నగర్​ మధ్య ఈ నెల 23 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది.

special trains running between secunderabad and sirpur kagajnagar
పండగ వేళ సిర్పూర్ కాగజ్​నగర్​కు ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Oct 23, 2020, 5:31 AM IST

దసరా పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్​నగర్​ల మధ్య ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. భువనగిరి, ఆలేరు, జనగాం, స్టేషన్​ ఘన్​పూర్, కాజీపేట్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, గోదావరిఖని, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో ఆగుతుందని రైల్వేశాఖ పేర్కొంది.

సికింద్రాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:40కి సిర్పూర్ కాగజ్​నగర్​కు చేరుకుంటుందన్నారు. అదేరోజు మధ్యాహ్నం సిర్పూర్ కాగజ్​నగర్​లో 2:45కు బయలుదేరి తిరిగి సికింద్రాబాదుకు రాత్రి 8గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు కాచిగూడ-నెక్లార్, కాచిగూడ-ఆకోలా, నాందేడ్-పన్వేల్, ధర్మాబాద్-మన్మాడ్, హైదరాబాద్-ఔరంగాబాదుకు ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఇదీ చూడండి:పండగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.