ఫిర్యాదుదారులతో మెలగాల్సిన విధానంపై షీటీమ్ పోలీసులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా ప్రారంభించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో సఖ్యతగా మెలిగి వారిలో మనోధైర్యాన్ని నింపితే.... ధైర్యంగా పోలీస్ స్టేషన్ వరకు రాగలుగుతారని అదనపు డీజీ స్వాతిలక్రా అన్నారు. రాష్ట్రంలో 30 షీటీమ్ యూనిట్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. 2014లో షీటీమ్‌కు శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాట్సాప్, హాక్ ఐ, మెయిల్, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసే వారి సంఖ్య 63శాతం పెరిగిందని డీజీఐ సుమతి తెలిపారు.
మహిళలను ఫోన్, ఆన్లైన్ ద్వారా వేధించే వారి సంఖ్య కూడా 40 నుంచి 63శాతానికి పెరిగిందని సుమతి అన్నారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వచ్చేలా వారిలో విశ్వాసాన్ని పెంపొందించాలని సుమతి సూచించారు. లింగ వివక్షపైనా షీటీమ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆధునిక సాంకేతికత వినియోగంపైనా షీటీమ్ అధికారులకు మూడు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. యాంకర్ సుమ ఈ కార్యక్రమంలో పాల్గొని షీటీమ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.
ఇవీ చూడండి: బీ అలర్ట్: స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా