ETV Bharat / state

పంచతత్వ పార్కు ప్రత్యేకతలేంటో తెలుసా? - Panchatatva Park latest news

ఆరోగ్యాన్ని పంచే.. వినూత్న అనుభూతిని కలిగించే మరో పార్క్​ గ్రేటర్​ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రోజువారీ.. ఉదయపు నడకకు భిన్నంగా ప్రత్యేక థీమ్​లతో పార్కుల్లో సరికొత్త వసతులు అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ దూరం నడిస్తేనే....ఎక్కువగా వాకింగ్ చేసిన అనుభూతితోపాటు.. సుగంధ ద్రవ్యాల వాసనతో ఆరోగ్యం మరింత కుదుటపడే అవకాశం ఉండాలని బల్దియా ఏర్పాటు చేస్తోంది. త్వ‌ర‌లో ఈ పార్కును ప్రారంభించేదుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అదేంటో మనమూ ఓసారి చూద్దాం.

special-story-on-panchatatva-park-at-indirapark-hyderabad
మహానగర ప్రజలకు.. త్వరలో అందుబాటులోకి పంచతత్వ పార్కు
author img

By

Published : Jun 30, 2020, 10:53 AM IST

గ్రేటర్​ హైదరాబాద్​ మహానగరంలో పంచతత్వ పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుంది. నగరంలోని ఇందిరా పార్కులోని ఎకరం స్తలంలో ఈ పార్కును తీర్చిదిద్దారు. అన్ని సాధారణ పార్కుల్లా కాకుండా.. నూతన విధానంలో పార్కును అభివృద్ధి చేశారు.

ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం

వృత్తాకారంలో ఉండే పంచతత్వ పార్క్​ వాక్​వేలో 9 బ్లాక్​లను ఏర్పాటు చేశారు. ఓ బ్లాక్​లో 20 ఎంఎం, మరో బ్లాక్​లో 10 ఎంఎం పరిమాణంతో కంకర రాళ్లు, ఇలా ఒక్కో బ్లాక్​ళో నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక రేణువులు, చెక్కపొట్టు, గులకరాళ్లను ఏర్పాటు చేశారు. పాత్​వేలో చెప్పులు, షూస్​ లేకుండా నడవడం వల్ల అరికాళ్లలో కలిగే ఒత్తిడి మెదడుకు చేరి మానసిక, ఆరోగ్య ప్రయోజనానికి ఉపకరిస్తుంది.

పంచావతారాలైన భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్నిల సమాహారమే అక్యుప్రేషర్​ థీమ్​(పంచతత్వ పార్కు). పార్కులో ఓ చెట్టు చుట్టూ.. గడ్డి, ఇసుక, కంకర, చెక్కపొట్టు, నీరు, బురదలతో ప్రత్యేక ట్రాక్​ నిర్మించారు. చెప్పులు లేకుండా ఈ ట్రాక్​లో నడవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరగవుతుందని చెబుతున్నారు.

మానసిక ఉల్లాసం

సాధారణంగా వాకింగ్​ చేసే వారితో పోలిస్తే.. కొబుల్​స్టోన్స్​పై నడిచే వృద్ధుల్లో బీబీ సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పాదాలకు ఆచ్ఛాదన లేకుండా నడవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలూ బాగా పనిచేస్తాయని అంటున్నారు. ఈ వ్యాయామంతో శారీరకంగానే కాకుండా.. మానసిక దృఢత్వమూ.. పెరుగుతుందని చెబుతున్నారు. ఉదయం 5 నుంచి 10 వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పంచతత్వ పార్కులో వాకింగ్​ చేసే అవకాశం ఉంది.

మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు

ఎకరం విస్తీర్ణంలో చేపట్టిన వాకింగ్​ ట్రాక్​ 17 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. పార్కులు భిన్నంగా ఉండాలని మంత్రి కేటీఆర్​ ఆదేశాల నేపథ్యంలో ఒక్కో జోన్​లో ఒక ఆక్యుప్రేషర్​ థీమ్​ పార్కును జీహెచ్​ఎంసీ అభివృద్ధి చేస్తోంది. ఇందులో నడిస్తే పాదాల్లో ఉండే నాడులు ఉత్తేజం పొంది రక్త ప్రసరణ జరిగి ఎక్కువ దూరం నడిచిన లాభం కలగనుంది. ఇక్కడ నవగ్రహాల మొక్కలు కూడా ఏర్పాటు చేశారు. ఇంపుగా ఉండేందుకుగా నీటి శబ్ధంతో పాటు... గౌతమ బుద్దుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ రాశులకు సంబంధించిన మొక్కలతో పాటు... 45 ఔషధ మొక్కలు కూడా నాటారు.

ఇదీ చదవండి: భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.