ETV Bharat / state

మొన్నటి వరకు బోగీలన్నీ ఖాళీ.. ఇప్పుడు అన్ని తరగతులూ ఫుల్‌!

కొద్దిరోజుల క్రితం వరకు రైళ్లలో ఏ బోగీ చూసినా చాలా బెర్తులు ఖాళీగా కనిపించేవి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో అయితే ప్రయాణికుల సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. దూరప్రాంత ప్రయాణాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి దిల్లీకి, బెంగళూరు, విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు నిండిపోతున్నాయి.

special story on heavy rush in trains
మొన్నటి వరకు బోగీలన్నీ ఖాళీ.. ఇప్పుడు అన్ని తరగతులూ ఫుల్‌!
author img

By

Published : Aug 21, 2020, 6:53 AM IST

దాదాపు ప్రతి రైల్లో రిజర్వేషన్లు పూర్తై వెయింటింగ్‌ లిస్ట్‌ వస్తోంది. కొన్ని రైళ్లలో ఆ పరిమితి కూడా దాటేసి ‘రిగ్రెట్‌’ వస్తోంది. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా మొన్నటి వరకు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు జనం. కొద్దిరోజులుగా రైలు ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపు ప్రతి రోజు మూడు రైళ్లుంటే.. ఎందులోనూ రిజర్వేషన్‌ ఖాళీ లేదు. ప్రతి రోజు వెయిటింగ్‌ లిస్టే.

దిల్లీకి హైదరాబాద్‌ వైపు నుంచి ప్రతి రోజు రెండు, వారానికి రెండు రోజులు నడిచే దురంతో రైళ్లున్నా ఏ ఒక్క బండిలోనూ ఖాళీల్లేవు. కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని రూట్లలోనే రైళ్లు నడుస్తుండటంతో మిగతా మార్గాలకు రాకపోకలు సాగించాల్సిన వారు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, గువాహటి వంటి దూరప్రాంతాలతో పాటు.. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్యాసింజర్‌, మెమూ, డెమూ రైళ్లలో ప్రయాణాలు చేసేవారు ప్రత్యామ్నాయ రవాణా చూసుకోవాల్సి వస్తోంది.

సాధారణ రోజుల్లో ఖాళీ.. ఇప్పుడు నిరీక్షణ

  • బెంగళూరు-దిల్లీ వయా సికింద్రాబాద్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అన్నీ ఏసీ బోగీలే. కొవిడ్‌కు ముందు ఈ రైల్లో చాలా ఖాళీలు ఉండేవి.
  • టికెట్లపై రాయితీ ఉన్న వారే ఎక్కువగా ప్రయాణించేవారు.
  • ఇప్పుడు ఈ రైల్లో ఏసీ బోగీలన్నీ నిండి ప్రతి రోజు వెయిటింగ్‌ లిస్ట్‌ వస్తోంది.
  • సికింద్రాబాద్‌-ముంబయి మధ్య హుస్సేన్‌సాగర్‌, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండింట్లోనూ ఇదే పరిస్థితి.

ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.