ETV Bharat / state

యువమిత్రుల ప్రస్థానం: ఉద్యోగాలు వదిలి.. ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి..! - డిజైన్‌ వాల్స్‌ అంకురసంస్థపై కథనం

వారిరువురివి ఉన్నత చదువులు.. ఉత్తమమైన ఉద్యోగాలు. అంతటితో సంతృప్తి చెందని ఆ యువకులు.. చిన్న వ్యాపారమైన మేలని భావించేవారు. అనూహ్యంగా కలిసిన ఆ ఇద్దరు మిత్రల ఆలోచన ఒక్కటవ్వడంతో వెంటనే ఆ ఆలోచనల్ని పట్టాలెక్కించారు. డిజైన్‌ వాల్స్‌ పేరిట ఏడేళ్ల క్రితం ప్రారంభమైన అంకుర సంస్థ దినాదినాభివృద్ధి చెందుతూ.. 100 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఇంటి అంతర్గత శోభలో భాగంగా... మేం మీ స్థలాన్ని మీ వాల్‌పేపర్లతో మారుస్తాం అన్న నినాదంతో ముందుకెళ్తోంది. ఉద్యోగాల్ని వదిలి.. సొంత వ్యాపారంలోకి అడుగుపెట్టి... తక్కువ కాలంలోనే ఘన విజయాలు సాధిస్తోన్నఈ యువమిత్రుల ప్రస్థానం ఇప్పుడు చూద్దాం

Special story on Friends who founded Design Walls startup company

author img

By

Published : Nov 21, 2022, 8:02 PM IST

యువమిత్రుల ప్రస్థానం: ఉద్యోగాలు వదిలి.. ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి..!

మారుతున్న కాలాన్ని బట్టి యువత ఆలోచన మారుతోంది. పెద్దపెద్ద ఉద్యోగాలకన్నా.. చిన్న వ్యాపారమైనా మేలనే భావన నేటి తరానిది. ఇదిగో అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ యువకులు. కాలేజీ రోజుల్లో మిత్రులైన వీరిద్దరూ.. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత కొన్నాళ్లు కార్పొరేట్ ఉద్యోగాలు చేశారు. కానీ మొదట్నుంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలనే ఆలోచన మదిలో మెదిలేది. దీంతో 2015లో "డిజైన్‌ వాల్స్‌" పేరిట అంకుర సంస్థను స్థాపించి అద్భుత విజయాలు సాధిస్తున్నారు.

ఇంటి గోడలకు వాల్‌పేపర్స్‌ను జోడిస్తే కలిగే అనుభూతుల్ని వివరిస్తున్న ఈ ఇద్దరు యువకల్లో ఒకరు గుంటూరుకు చెందిన విమల్‌శ్రీకాంత్‌ కాగా మరొకరు అదే జిల్లాకు చెందిన అభినవ్‌రెడ్డి. వరంగల్‌లో ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్నోవేటీవ్‌ టెక్నాలజీ, రీసెర్చ్‌- ఐజేఐటీఎస్‌లో చదువుకునే రోజుల్లో మిత్రులయ్యారు. విడిగా కొన్నాళ్ల పాటు ఉద్యోగాలు చేసిన యువకులు.. ఓ ఫంక్షన్‌లో కలుసుకొని తమ వ్యాపార ఆలోచనల్ని పంచుకున్నారు.

వాల్‌ డిజైన్‌ రంగంలోకి తొలుత అడుగుపెట్టిన అభినవ్‌.. తనకు భాగస్వామి సహకరించకపోవడం, మార్కెటింగ్‌లో ఎదురైన సవాళ్లు, సేవల తీరు లాంటివి మిత్రుడు విమల్‌తో పంచుకున్నాడు. అప్పటికే మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న విమల్‌... వ్యాపార భాగస్వామి కావాలన్న అభినవ్‌ సూచనపై సానుకూలంగా స్పందించడంతో ఇద్దరూ జతకట్టారు. నాటి నుంచి వినియోగదారుల అభిరుచి మేరకు వాల్‌ పేపర్లు సమకూర్చుతూ వ్యాపారంలో రాణిస్తున్నాం అంటాడు అభినవ్‌ రెడ్డి.

ఇద్దరు మిత్రులు, మరో ఇద్దరితో కలిసి మియాపూర్‌లో లక్ష రూపాయల పెట్టుబడితో డిజైన్‌ వాల్స్‌ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంటి అందం రెట్టింపు, ఆకర్షణీయత కలిగించే శోభ.. ఆహ్వానీతులను ఆకట్టుకునే రీతిలో వాల్‌పేపర్లు, కర్టైన్లు, అంతర్గత అలంకణ సేవలు అందిస్తున్నారు. ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ... వాటిని అధిగమించే క్రమంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు ఈ యువ వ్యాపారవేత్తలు.

భవన నిర్మాణ రంగంలో వస్తోన్న మార్పుల నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇంట్లోని హాల్‌, బెడ్‌రూం, బాల్కనీలో కొత్త అందాలు తీసుకొస్తూ కస్టమర్ల ఆధరణ చూరగొంటున్నారు ఈ వ్యాపార స్నేహితులు. రంగుల మాయలోకి తీసుకెళ్లే తమ టీం నైపుణ్యంతో పాటు సృజనాత్మకతను జోడించి... అత్యాధునిక యంత్రాలపై రూపొందిన అందమైన డిజైన్లు, 3డీ వాల్‌ పేపర్లు వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

మార్కెటింగ్‌లో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులు, తప్పొప్పులను విశ్లేషించుకుంటూ ముందుకు సాగుతున్న అభినవ్‌, విమల్‌.. ఏడేళ్ల ప్రస్థానంలో ఏనాడు వెనక్కి చూసుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. డిజైన్‌ వాల్స్‌ సంస్థ ఇప్పటికి 2వందలకు పైగా సంస్థలతో కలిసి 5 వేలకంటే ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసింది. 30 లక్షలకు పైగా చదరపు మీటర్ల విస్తిర్ణంలో లక్షకు పైగా వాల్‌ డిజైన్లకు అమర్చించి ఈ డిజైన్‌ వాల్‌ సంస్థ. ఇంతటి ఘన విజయాలు సొంతం చేసుకుంటున్న ఈ యువ మిత్రులు టైమ్స్‌ ఆర్‌ ఇండియా సహా నాలుగు జాతీయ పురస్కారాలు సొంతం చేసుకోవడం పట్ల సంస్థ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మణికొండ, హైటైక్‌ సిటీ, మియాపూర్‌, కొంపల్లి, తూంకుంట, ఎల్బీనగర్‌లో డిస్ట్రిబ్యూటరు, డీలరు స్టోర్లను ఏర్పాటు చేశారు. 2019 నుంచి ఏటా 10 కోట్ల రూపాయల లావాదేవీలు సాధిస్తున్నారు. దీంతో డిజైన్‌ వాల్స్‌లో మూడేళ్ల పాటు సేవలందిస్తున్న ఉద్యోగులకు సంస్థ వాటాల్లో భాగస్వామ్యం కల్పించడం ప్రత్యేకత. దీంతో వారు రెట్టింపైన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తున్నాం అంటారు. హైదరాబాద్‌లో అనూహ్య విజయాలు సాధిస్తున్న డిజైన్‌ వాల్స్‌ సేవలు... రాబోయే 3డేళ్లలో జాతీయ, ఐదేళ్లలో అంతర్జాతీయ స్థాయికి అందించాలనే సుస్థిర లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఈ యువ వ్యాపారవేత్తలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.