ETV Bharat / state

ఓటీపీ అడుగుతారు.. సొమ్మంతా లాగేస్తారు - సైబర్​ నేరాలు

బ్యాంకు అధికారులమంటూ మీకు ఫోన్​ చేస్తారు... ఓటీపీ చెప్పమంటారు. మీరు వాళ్లను నమ్మి చెప్పారంటే... ఇక అంతే సంగతులు. మీ ఖాతాలోని సొమ్మంతా దోచుకుంటారు. ఇప్పుడు ఇలాంటి కేసులు నగరంలో ఎక్కువవుతున్నాయి. మీరు అప్రమత్తంగా ఉంటే సైబర్‌ నేరస్థులకు మోసం చేసే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

special-story-on-cyber-crimes-increases-in-hyderabad
ఓటీపీ అడుగుతారు.. సొమ్మంతా లాగేస్తారు
author img

By

Published : Jun 12, 2020, 11:01 AM IST

బ్యాంకు అధికారులు, పేటీఏం, ఫోన్‌పే అధికారులుగా కొందరు పరిచయం చేసుకుని తమ ఖాతాల్లోంచి రూ.వేలల్లో నగదు విత్‌డ్రా చేసుకున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఫిర్యాదు చేసేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ ఠాణాకు వస్తున్నవారి సంఖ్య సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఓటీపీ నంబరు చెప్పాక ఎవరూ ఏం చేయలేరని, నిందితులను పట్టుకోగలం తప్ప డబ్బు వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నప్పటికీ.. నేరస్థులను అరెస్ట్‌ చేస్తే డబ్బు తిరిగి వస్తుందన్న ఆశతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వస్తున్నారు.

పేటీఎం, ఫోన్‌పే, డెబిట్‌ కార్డుల నుంచి రూ.వేలు, లక్షలు స్వాహా చేస్తున్న ముఠాలు పశ్చిమబంగ, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి.ఒక్కో ముఠాలో నలుగురు లేదా ఐదుగురు సభ్యులుంటున్నారు.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఎస్‌బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ ఖాతాదారుల ఏటీఎం కార్డుల నంబర్లు, పేర్లు, వివరాలను దిల్లీ, ముంబయిలలో పొరుగుసేవల సిబ్బంది ద్వారా సేకరిస్తున్నారు. పేటీఎం, ఫోన్‌పే ఖాతాల వివరాలనూ ఇదే మాదిరి చేస్తున్నారు.

కొత్త సిమ్‌కార్డులు తీసుకుని డెబిట్‌కార్డుదారుల ఫోన్‌నంబర్లకు కాల్‌ చేస్తున్నారు.

బాధితులు ఓటీపీ చెప్పినా... యూపీఐ నంబర్‌ను తెలిపినా వెంటనే ఫిర్యాదు చేస్తే 24 గంటలపాటు కొన్ని గేట్‌వేలు సైబర్‌ నేరస్థుల ఖాతాల్లోకి వెళ్లకుండా నిలిపేస్తున్నారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు త్రీడీ సెక్యూరిటీ పిన్‌ను ఇస్తున్నాయి. అయితే నేరస్థులు బాధితులను మాటల్లో ఉంచి ఆ సెక్యూరిటీ పిన్‌ కూడా తీసేసుకుంటున్నారు. డెబిట్‌ కార్డుదారులకు అవగాహన కల్పిస్తున్నా.. బాధితుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. సైబర్‌క్రైమ్‌ పోలీసు ఠాణాకు సగటున రోజుకు పదిమంది బాధితులు వస్తున్నారు. ఇందులో చాలామంది మధ్యతరగతి వారే ఉంటున్నారని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు

అప్రమత్తంగా ఉండండి

బ్యాంక్‌ అధికారులు, పేటీఎం ప్రతినిధులమంటూ ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే నమ్మకూడదు. వారెవరూ నేరుగా డెబిట్‌ కార్డుదారులకు ఎప్పుడూ ఫోన్‌ చేయబోరు. బ్యాంకు అధికారులే ఫోన్‌ చేసారని అనుకుంటే పొరపాటే. మీరు అప్రమత్తంగా ఉంటే సైబర్‌ నేరస్థులకు మోసం చేసే అవకాశం ఉండదు.

-కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.