ETV Bharat / state

కరోనా రోగులకు ప్రత్యేక ఓపీ సేవలు - కొవిడ్​ రోగులకు ప్రత్యేక ఓపీ

రాష్ట్రంలో కరోనా రోగులకు గురువారం నుంచి ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య ఉపకేంద్రం స్థాయిలోనూ నిర్వహణ లక్షణాలుంటే ఐసొలేషన్‌ కిట్‌ అందజేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమాచారం సేకరిస్తున్నారు. ఈ సేవలు త్వరలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అమల్లోకి రానున్నాయి.

Special OP for corona patients, corona patients for op services
కరోనా రోగులకు ప్రత్యేక ఓపీ సేవలు
author img

By

Published : May 7, 2021, 8:05 AM IST

కొవిడ్‌ రోగులకు ప్రత్యేక ఓపీ నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఆరోగ్య ఉపకేంద్రం(సబ్‌సెంటర్‌) మొదలుకొని బోధనాసుపత్రుల దాకా అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకంగా ఓపీ సేవలకు ఏర్పాట్లు చేయాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ వైద్యంలోనే కాదు.. ప్రైవేటులోనూ ఈ సేవలను ప్రారంభించాలని తీర్మానించింది. ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. గురువారం నుంచి ప్రభుత్వ వైద్యంలో కొవిడ్‌ ప్రత్యేక ఓపీ ప్రారంభం కాగా.. త్వరలోనే ప్రైవేటులోనూ ఆరంభం కానున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

వైద్యుని సంప్రదింపుల్లేక ఇంటి వద్దే కుదేలు
కొవిడ్‌ బాధితుల్లో సుమారు 15-20 శాతం మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతుండగా..దాదాపు 80 శాతం మందికి పైగా ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైద్యంలో పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే.. ఆసుపత్రిలోనే వారికి కొవిడ్‌ ఔషధ కిట్‌ను అందజేస్తున్నారు. కొందరు ప్రైవేటులో వైద్యుని సలహా మేరకు సొంతంగా మందులు కొనుక్కొని వాడుకుంటున్నారు. అయితే ఇంట్లో చికిత్స పొందే క్రమంలో కొన్నిసార్లు బాధితుల ఆరోగ్యం ఉన్నట్టుండి విషమిస్తోంది. పరిస్థితిని అర్థం చేసుకునే లోపే కన్నుమూస్తున్నారు. ఈ తరహా సంఘటనలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది.

ప్రైవేటుగా చికిత్స పొందుతున్న వారిలోనూ ఈ తరహా అనారోగ్యం చుట్టుముడుతున్నా.. అధికులు ఎలాగోలా వైద్యున్ని సంప్రదించగలుగుతున్నారు. ఇంటి వద్ద చికిత్స పొందుతుండడంతో ప్రధాన లోపం.. వైద్యుని సంప్రదింపులనేవి అస్సలు లేకపోవడమేనని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయానికొచ్చింది. ప్రత్యక్షంగా వైద్యుడు రోగిని చూసే వెసులుబాటు లేకపోవడంతో.. ఇంటి వద్ద చికిత్సల్లోనే బాధితులు కుదేలవుతున్నట్లుగా ఆరోగ్యశాఖ గుర్తించింది. దీన్ని నివారించడంలో భాగంగానే.. కొవిడ్‌ ప్రత్యేక ఓపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా రోగి నేరుగా వైద్యున్ని సంప్రదించవచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు, లక్షణాల గురించి కూడా డాక్టర్‌ ఆరా తీయడానికి వీలవుతుంది. విషమ పరిస్థితిని ముందస్తుగా గుర్తించి, సత్వర చికిత్స అందించడానికి మార్గం సులభమవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి.

రోజూ కొనసాగింపు
* ఇంట్లో చికిత్స పొందుతున్న రోగి తనకు ఎప్పుడు అస్వస్థతగా అనిపిస్తే.. ఆ రోజు ప్రత్యేక ఓపీకి హాజరు కావచ్చు. సెలవు రోజులు మినహా అన్ని రోజుల్లో ఓపీ నిర్వహిస్తారు.
* పీపీఈ కిట్‌, ఎన్‌ 95 మాస్కు ధరించిన వైద్య సిబ్బంది వీరిని పరీక్షిస్తారు.
* జ్వరం, పల్స్‌, రక్తంలో ఆక్సిజన్‌ శాతం తదితర పరీక్షలు నిర్వహించి ఔషధాలు సూచిస్తారు.
* బాధితుడి ఆరోగ్యం విషమంగా ఉందని గుర్తిస్తే.. వెంటనే మెరుగైన చికిత్సకు పెద్దాసుపత్రికి తరలిస్తారు.
* ఆరోగ్య ఉపకేంద్రం స్థాయిలో ఏఎన్‌ఎం ఈ బాధ్యతలను నిర్వహిస్తారు.
* జ్వరం ఉందని తెలియగానే.. పరీక్షలతో సంబంధం లేకుండా ఐసొలేషన్‌ కిట్‌ను అందజేస్తారు. ఇక నుంచి ఈ కిట్‌లో యాంటీబయాటిక్స్‌, విటమిన్‌ మాత్రలు, జ్వరం గోలీలతో పాటు స్టెరాయిడ్‌ ఔషధాలను కూడా ప్రత్యేక కవర్‌లో అందజేస్తారు.
* అయిదు రోజులుగా చికిత్స పొందుతున్నా జ్వరం వస్తుంటే.. వెంటనే స్టెరాయిడ్‌ ఔషధాలను వినియోగించాలని వైద్యసిబ్బంది సూచిస్తారు.
* ప్రత్యేక ఓపీలో ఇచ్చిన ఔషధాలను ఇంటి వద్ద వినియోగిస్తున్నారా? లేదా? ఆరోగ్యం ఎలా ఉందనే పరిశీలనకు ప్రత్యేక వైద్యసిబ్బంది సమాయత్తమైంది. ఇందుకు క్షేత్రస్థాయి సిబ్బంది మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బాధితునికి జ్వరం, పల్స్‌, ఆక్సిజన్‌ ఎంతుందనేది పరీక్షిస్తారు. గురువారం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించారు.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై దిల్లీ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.