కరోనా సోకిన రైల్వే ఉద్యోగులకు చికిత్స అందించేందుకు లాలాగూడలోని సెంట్రల్ హాస్పిటల్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వచ్చే వారం నుంచి కరోనా బారిన పడిన రైల్వే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు చికిత్స అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రెండు, మూడు రోజుల్లో కొన్ని మరమ్మతులు పరికరాలు వచ్చిన అనంతరం చికిత్స ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వైద్య, పారామెడికల్ సిబ్బందికి రెండు వారాల పాటు విధుల్లో, మరో రెండు వారాలు క్వారంటైన్లో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు సమతుల ఆహారం, నిత్యం శానిటేషన్ చేసే ప్రక్రియను కూడా చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ తదవండి: పారాసిటమాల్ వేసుకుంటే చాలన్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి