ETV Bharat / state

'రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులపై మరింత నిఘా' - వలస కార్మికులు

రాష్ట్రంలో రెడ్‌జోన్‌ జిల్లాలు మినహా మిగిలిన చోట్ల లాక్‌డౌన్‌ ఎత్తివేయడం... ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్దఎత్తున వలసజీవులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడిపై ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమైంది. ఇలా వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు.

special focus on migrants at telangana
'రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులపై మరింత నిఘా'
author img

By

Published : May 11, 2020, 9:43 AM IST

రాష్ట్రంలో తొలుత అంతర్జాతీయ ప్రయాణికులు, అనంతరం మర్కజ్‌ ప్రయాణికులు, వారి సన్నిహితుల్లో వైరస్‌ వ్యాప్తిని గుర్తించడం, నియంత్రించడంపై దృష్టిపెట్టిన వైద్యఆరోగ్యశాఖ సానుకూల ఫలితాలు సాధించింది. లాక్‌డౌన్‌ కాలంలో కేసుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అయితే రెండు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా... కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస జీవులవి కూడా జతచేరడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచీ వచ్చే ప్రయాణికులపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కువైట్‌ నుంచి 160 మంది ప్రయాణికులతో కూడిన విమానం రాష్ట్రానికి వచ్చింది. రానున్న రోజుల్లో మరికొన్ని అంతర్జాతీయ విమానాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి.

ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న కార్మికులు సైతం అక్కడ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో వారం రోజులుగా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ముంబయి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి నిర్వహించిన పరీక్షల్లో 11 మందిలో కరోనా నిర్ధారణ అయింది. వీరి ద్వారా మరిందరికి వైరస్‌ వ్యాపించే అవకాశాలుండడంతో ఆరోగ్యశాఖలో ఆందోళన రేగుతోంది. ఈ విషయంపై వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్చించారు. ప్రధానితో నేడు జరగనున్న ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులోనూ దీన్ని ప్రస్తావించనున్నట్లు తెలిసింది.

మరింత అప్రమత్తత

ఇటీవల బిహార్‌ నుంచి 300 మంది వలస కార్మికులు రాష్ట్రంలో పనుల కోసం ప్రత్యేక రైలులో ఇక్కడికి వచ్చారు. వీరంతా నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, సిద్దిపేట.. తదితర వివిధ ప్రాంతాల్లో పనులు చేయడానికి వచ్చారు. మారుతున్న పరిణామాల దృష్ట్యా, రాష్ట్రంలో అంతర్గత కేసులను అంచనావేయడం, చికిత్స అందించడం, వ్యాప్తిని అడ్డుకోవడమే కాక.. వెలుపలి నుంచి రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నవారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరముందని అధికారులు నిర్ణయించారు.

అక్కడ పరీక్షలు చేసినా...

అంతర్జాతీయ ప్రయాణికులకు ఆయా దేశాల్లోనే పరీక్షలు నిర్వహించి... వైరస్‌ లేదని నిర్థారించాకే పంపిస్తున్నారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర వైద్యాధికారులు మరోసారి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ముద్రవేసి పంపిస్తున్నారు. అంతర్రాష్ట్ర ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా లేకపోతే కొత్త చిక్కులొచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది. వీరిలో అత్యధికులు రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించి నేరుగా వారి ఊళ్లకు చేరిపోతున్నారు. అందుకే పటిష్ఠ కార్యాచరణ అమలుపై దృష్టిపెట్టాలని అధికారులు నిర్ణయించారు.

కట్టడి కార్యాచరణ ఇలా..

  • రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకల నియంత్రణపై కఠిన వైఖరి అనుసరించాలి.
  • అనుమతులతో వచ్చినవారికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. అనుమానిత లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
  • వారి ఫోన్‌ నంబర్లు, నివాసిత ప్రాంతాల చిరునామాలను సేకరించాలి. నిర్దేశిత కాల వ్యవధి మేరకు హోం క్వారంటైన్‌కు పంపిస్తూ చేతులపై ముద్ర వేయాలి.
  • ఇంట్లోనూ వ్యక్తిగత దూరం పాటించాలని, మాస్కు ధరించాలని, చేతులకు తొడుగులు వేసుకోవాలని జాగ్రత్తలన్నీ తెలియజెప్పాలి.
  • పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారి సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించాలి.
  • నిత్యం ఆరోగ్య కార్యకర్తలు వారిని పరీక్షించాలి.
  • సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని హోం క్వారంటైన్‌లో ఉన్నవారి కదలికలను పసిగట్టాలి.

ఇవీ చూడండి: పాసుల కోసం తగ్గిన దరఖాస్తులు... ఎందుకంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.