దసరా రద్దీ దృష్ట్యా 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు (apsrtc special services). ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయన్నారు. ఒకవైపే రద్దీతో నష్టం రాకుండా ఉండేందుకు ఈ అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లోనే అదనపు ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: commercial tax in telangana: రాష్ట్రంలో పెరిగిన వాణిజ్య పన్నుల ఆదాయం.. వృద్ధి రేటు ఎంతంటే?