ETV Bharat / state

బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు సరోజినీదేవి ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు - తెలంగాణలో బ్లాక్​ఫంగస్ వార్తలు

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు వైద్య సేవలు అందించడానికి రాజధానిలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇక్కడ మొదటిదశలో 200 పడకలను ఏర్పాటు చేసి బుధవారం నుంచి చికిత్సలు మొదలుపెట్టారు.

special-arrangements-at-sarojini-devi-hospital-for-black-fungus-patients
భర్తకు బ్లాక్ ఫంగస్.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
author img

By

Published : May 27, 2021, 7:23 AM IST

బ్లాక్​ఫంగస్ బాధితులకోసం సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో.. 200 పడకలతో పాటు.. ఆపరేషన్లకు 5 థియేటర్లను సిద్ధం చేశారు. దాదాపు 25 ఏళ్లుగా కంటి వైద్యంలో పేరొందిన ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.రాజలింగం నేతృత్వంలో ఫంగస్‌ రోగులకు శస్త్ర చికిత్సలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 25 వేల సాధారణ కంటి ఆపరేషన్లు చేసిన రాజలింగం బ్లాక్‌ ఫంగస్‌పై పరిశోధన కూడా చేస్తున్నారు. ఈటీవీ భారత్​కి​ ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన రోగులకు తాము అందించే సేవల గురించి వివరించారు. రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం చేసి క్షేమంగా ఇంటికి పంపిస్తామని హామీ ఇస్తున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందా?

మా ఆసుపత్రిలో 550 పడకలున్నాయి. మొదటిదశ కింద ఫంగస్‌ రోగుల కోసం 200 పడకలు కేటాయించాం. కరోనా వల్ల సాధారణ కంటి రోగులు పెద్దగా రావడం లేదు. ప్రస్తుతం 50 పడకల్లోనే ఉన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే మొత్తం ఆసుపత్రిని ఫంగస్‌ రోగుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రిగా మార్చడానికి కూడా ఇబ్బంది లేదు. మా ఆసుపత్రిలో చేరితే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా వైద్యం చేసి క్షేమంగా ఇంటికి పంపిస్తాం. ప్రతి రోగిని ఒక్కో వైద్యునికి దత్తత ఇచ్చి పూర్తిస్థాయి వైద్యం అందిస్తాం.

శస్త్రచికిత్సలకు డాక్టర్లు, నర్సింగ్‌, ఇతర సిబ్బంది తగినంతమంది ఉన్నారా?

పీజీలతో కలిపితే 152 మంది వైద్యులు ఉన్నారు. 72 మంది నర్సులు, సరిపడా సిబ్బంది ఉన్నారు. 150 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. 5 వెంటిలేటర్లు, 5 అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. అవసరమైన రోగులకు ఆపరేషన్లు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం మా ఆసుపత్రికి చెందిన ఏడుగురు కంటి వైద్యులు ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రులకు వెళ్లి ఆపరేషన్లు చేస్తున్నారు. కొంతమంది ఈఎన్‌టీ వైద్యులను మాకు కేటాయించడానికి ఉన్నతాధికారులు అంగీకరించారు. మందులు, ఇంజక్షన్లు అందించనున్నారు. బుధవారం ఒక రోగి చేరారు.

కొవిడ్‌కు ముందు ఈ ఫంగస్‌ ఇంత తీవ్రంగా ఉందా.. అప్పట్లో కూడా ఇలాంటి శస్త్ర చికిత్సలు చేశారా?

అప్పట్లో మా ఆసుపత్రికి ఏడాదికి నాలుగో, అయిదో మాత్రమే కేసులు వచ్చేవి. ఇద్దరు ముగ్గురికి ఆపరేషన్లు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం తీవ్రత ఎక్కువగా ఉంది. వారం రోజుల వ్యవధిలోనే ఇది అనేక అంగాలకు వ్యాప్తి చెందుతోంది.

వైరస్‌ సోకిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ముక్కు, నోటి ద్వారా ఈ ఫంగస్‌ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కన్ను గుడ్డు వెనుక భాగంలో నరాలపై ప్రభావం చూపిస్తుంది. అక్కడి నరాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణ జరగడం లేదు. అందుచేత ముక్కు మూసుకుపోయినా, నల్లటి ద్రవం కారినా, తలనొప్పి చాలా ఎక్కువగా వచ్చినా, కన్ను వాచినా బ్లాక్‌ ఫంగస్‌ కావచ్చని అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స మొదలుపెట్టాలి.

ఫంగస్‌ బారినపడకుండా ఉండాలంటే ఏంచేయాలి?

ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా మాస్కు తీయకుండా ఉంటే 90 శాతం వరకు బ్లాక్‌ ఫంగస్‌ నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి. మల్టీ విటమిన్లు, సీ విటమిన్‌లాంటివి వాడుతూనే పోషకాహారాన్ని తీసుకోవాలి. రక్తపోటు తినకముందు 110 లోపు, తిన్న తరువాత 160 లోపు ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చూడండి: Black Fungus: మోతాదుకు మించి స్టెరాయిడ్ల వినియోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.