ETV Bharat / state

వర్క్​ ఫ్రమ్​ హోమ్​తో ఇబ్బందులా... అయితే​ ఈ యాప్​ మీ కోసమే. - వర్క్​ ఫ్రమ్​ హోమ్​తో ఇబ్బందులా... అయితే​ ఈ యాప్​ మీ కోసమే.

లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి. ఈ తరుణంలో ఉద్యోగులు ఇంటి దగ్గర ఉండే... ఆఫీసులో చేసే పనులన్నింటిని నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ... ఇంట్లో మనల్ని ఆపడానికి బాస్ ఎవరూ ఉండరు. పని చేద్దాం అని కూర్చొని.. టైం అంతా పనికిరాని యాప్​లు చూస్తూ గడిపేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ కథనం... మీరూ ఓసారి లుక్కేయండి.

వర్క్​ ఫ్రమ్​ హోమ్​తో ఇబ్బందులా... అయితే​ ఈ యాప్​ మీ కోసమే.

author img

By

Published : Apr 29, 2020, 2:30 PM IST

ఇంట్లో పని చేద్దాం అని కూర్చుంటాం.. సిస్టం ఆన్‌ చేస్తాం.. కాసేపు ఫేస్‌బుక్‌ చూద్దాం అని ఓపెన్‌ చేస్తాం.. మళ్లీ ఫోన్‌ అందుకుని యూట్యూబ్‌ చూస్తాం.. మెయిల్‌ బాక్స్‌ చెక్‌ చేస్తాం.. ఇలా పని కంటే ఎక్కువగా అదీ ఇదీ చూస్తూనే సమయం వృథా చేస్తుంటాం. అందుకే.. వర్క్‌ ఫ్రం హోమ్‌ అంటే అంత సులువుకాదు. ఆఫీసులో మాదిరి ఇంట్లోనూ ఏకాగ్రతతో పని చేయాలంటే? కొన్నింటికి దూరంగా ఉండాలి. అది మీ వల్ల కాకుంటే ఓ యాప్‌ని వాడండి. అదేం చేస్తుందంటే.. మీరు చూడొద్దు, వాడొద్దు అనుకునే యాప్స్‌, వెబ్‌సైట్స్‌కి కాస్త దూరంగా ఉంచుతుంది. ఇంతకీ ఈ యాప్‌ పేరు ఏంటంటే.. 'స్టే ఫోకస్​డ్'. ఇదొక యాప్‌ బ్లాకర్‌. మీరు తరచుగా వాడే యాప్‌ లేదా వెబ్‌సైట్‌కి కాసేపు తాళమేసి పని చేసుకోవచ్చు. నిర్ధిష్ట సమయం పెట్టుకొని ఆ సమయంలోనే యాప్స్‌ ఓపెన్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు కూడా. ఎక్స్‌టెన్షన్‌ రూపంలో బ్రౌజర్‌కి జత చేసుకుని ల్యాపీ, డెస్క్‌టాప్‌లలో వాడుకోవచ్చు. క్రోమ్‌ యూజర్లు ‘వెబ్‌ స్టోర్‌’ నుంచి ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: క్రికెట్ నుంచి ఆస్కార్ సినిమాలో అవకాశం వరకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.