ETV Bharat / state

మరో 42 తాత్కాలిక సీట్లను ఏర్పాటు చేయండి: పోచారం

author img

By

Published : Aug 21, 2020, 6:35 AM IST

ఆగస్టు 7 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరో 42 తాత్కాలిక సీట్లు ఏర్పాటు చేయాలని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం ఇద్దరేసి సభ్యులు కూర్చునేలా 76 సీట్లు ఉండగా... వాటిల్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి, మిగిలిన 42 మంది కోసం తాత్కాలికంగా సీట్లు ఏర్పాటు చేయాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు.

శాసనసభలో మరో 42 తాత్కాలిక సీట్లకు ఏర్పాట్లు చేయండి : స్పీకర్ పోచారం

వచ్చే నెల ఏడు నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం పాటించేలా శాసనసభ నిర్ణయించింది. ఈ మేరకు మరో 42 తాత్కాలిక సీట్లు ఏర్పాటు చేయాలని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం ఇద్దరేసి సభ్యులు కూర్చునేలా 76 సీట్లు ఉండగా... వాటిల్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి, మిగిలిన 42 మంది కోసం తాత్కాలికంగా సీట్లు ఏర్పాటు చేయాలని స్పీకర్ ఆదేశించారు.

ప్రతిరోజూ శానిటైజ్...

కొవిడ్ వైరస్ నివారణ చర్యల్లో భాగంగా శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ప్రతిరోజూ శాసనసభ, మండలిని శానిటైజ్‌ చేయాలని తీర్మానించారు. కరోనా లక్షణాలున్న సభ్యులను, ఇతరులను గుర్తించే విధంగా శాసనసభ, మండలి, బయట, లోపల అధునాతన స్కానర్లను ఏర్పాటు చేయనున్నారు. సభ్యులు మాస్కులు పెట్టుకోకపోతే స్కానర్ సైరన్‌ మోగిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుంది. శానిటైజ్‌ చేస్తుంది. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద దీనిని అమర్చనున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.

పోచారం, గుత్తా, మంత్రి వేముల సందర్శన

శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల కోసం ఒకటో తేదీనాటికి ఏర్పాట్లు పూర్తిచేయాలని సభాపతి పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా అధికారులను ఆదేశించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కార్యదర్శి నర్సింహాచార్యులుతో కలిసి గురువారం శాసనసభ, మండలి సమావేశ మందిరాలను, ముందు జాగ్రత్త చర్యలను పరిశీలించారు. కరోనా మహమ్మారి పొంచి ఉన్న తరుణంలో పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను అదేశించారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సమావేశాలకు మీడియాను అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇవీ చూడండి : స్వచ్ఛ్ సర్వేక్షణ్​లో కరీంనగర్​కు 72వ స్థానంపై గంగుల ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.