ETV Bharat / state

Heavy Rains in Telangana : మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన 'నైరుతి'.. దంచికొడుతున్న వానలు - Early rains

Southwest Monsoon entered in Telangana : నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల 1-2 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రాకతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

Southwest Monsoon
Southwest Monsoon
author img

By

Published : Jun 23, 2023, 4:09 PM IST

Heavy Rains in Hyderabad : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచే ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. గత రాత్రి అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్​లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులు జలమయం కాగా.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ జంటనగర వాసులు నైరుతి పలకరించడంతో కాస్త కూల్​ అయ్యారు.

Southwest Monsoon IMD report : నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల 1-2 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్​ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మి. వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా కొనసాగుతుందని వెల్లడించింది.

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.

సిద్ధిపేట జిల్లాలో భారీ వర్షం: నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిద్ధిపేట జిల్లాలో సుమారు గంటసేపు కుండపోత వర్షం కురిసింది. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఎండలు దంచికొట్టడంతో వేడెక్కిన వాతావరణం.. ఇవాళ వర్షాలతో కాస్త చల్లబడింది.

హైదరాబాద్​లో వర్షాలు: హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఎల్బీనగర్​ నుంచి హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్​ ప్రాంతం వరకు భారీ వర్షం పడింది. ఈదురు గాలులు వీచడంతో అక్కడక్కడ చెట్లు నెలకొరిగాయి. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడిన భాగ్యనగర వాసులు నైరుతి రుతుపవనాలు పలకరించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.