ETV Bharat / state

Zonal Council meeting: జోనల్ కౌన్సిల్ సమావేశంలో గళం వినిపించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Nov 12, 2021, 5:21 AM IST

Updated : Nov 12, 2021, 6:43 AM IST

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో వాదనలు బలంగా వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది (Zonal Council meeting). రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలు సహా ఇతర అంశాలను భేటీలో ప్రస్తావించనున్నారు. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలకు ధీటైన సమాధానాలు ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది.

Zonal Council meeting
Zonal Council meeting
జోనల్ కౌన్సిల్ సమావేశంలో గళం వినిపించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 14 జరగనుంది (Zonal Council meeting). కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (home minister Amit Shaw) నేతృత్వంలో జరగనున్న భేటీకి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) సమావేశానికి వెళ్తారా... లేదా అన్న విషయమై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే, సీఎం హాజరు కాకుండా ఆయన తరఫున ఎవరైనా ఒక మంత్రిని పంపొచ్చని సమాచారం. సమావేశం ఎజెండాలో రాష్ట్రం ప్రతిపాదించిన అంశాలు ఏవీ లేవు. అయితే విభజన చట్టం హామీలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్​లో ఉన్న విభజన అంశాలు, పొరుగు రాష్ట్రాలు లేవనెత్తిన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు భేటీలో ప్రస్తావనకు రానున్నాయి.

సమాచారం సిద్ధం చేసే పనిలో అధికారులు

రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సమావేశంలో బలమైన వాణి వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయా అంశాలపై సమగ్ర నివేదికలను అధికారులు తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. సంబంధిత శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (cs somesh kumar) ఇప్పటికే సమావేశమై దీనిపై సమీక్షించారు. రాష్ట్ర వాదనలు బలంగా ఉండేలా పటిష్ఠ సమాచారాన్ని సిద్ధం చేయాలని చెప్పారు.

వాటి ప్రకారం నడుచుకునేందుకు ఇబ్బంది లేదు

తెలంగాణ నుంచి తమకు 6,015 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు రావాలని కోరుతూ ఏపీ... ఎజెండాలో చేర్చింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అంతకంటే చాలా ఎక్కువ మొత్తం రావాలని అంటున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇదే విషయాన్ని మరోమారు సమావేశంలో వివరించనుంది. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన అంశం కూడా ఎజెండాలో ఉంది. విభజన చట్టం, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని... అందుకు భిన్నంగా ఆస్తుల పంపిణీకి ఆస్కారం లేదని తెలంగాణ అంటోంది.

నదీ యాజమాన్య బోర్డులపైన చర్చ

పాలమూరు - రంగారెడ్డి (palamuru - rangareddy), డిండి ఎత్తిపోతల (dindi lift irrigation) పథకాలతో పాటు సంగంబండ ఆనకట్ట నిర్మాణాన్ని కర్ణాటక ఎజెండాలో ప్రతిపాదించింది. ఏపీ కూడా వీటిపై ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. దీంతో కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా, కేటాయింపులు తదితర అంశాలను భేటీలో ప్రస్తావించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నదీ యాజమాన్య బోర్డులు (river management boards), నదుల అనుసంధానికి సంబంధించి కూడా రాష్ట్ర వాదనను పునరుధ్ఘాటించనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిని సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. విభజన చట్టం హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని జోనల్ కౌన్సిల్ (Zonal Council meeting) వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ మిషన్, మహిళలు, చిన్నారులపై లైంగికదాడుల కేసుల సత్వర విచారణ, నిక్షయ్ పోషణ యోజన, జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం, వివిధ రైల్వే పనులు, రోడ్డు మార్గాలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది.

ఇదీ చూడండి: TGOS MEET CM KCR: తెలంగాణలో భారీ ఉద్యోగ నియామక ప్రక్రియ అప్పుడేనట!

Last Updated : Nov 12, 2021, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.