ETV Bharat / state

Engineering‌ Education: దక్షిణాదిలోనే ఎక్కువ.. ఆరేళ్లలో 5.3 శాతం సీట్ల పెరుగుదల - దక్షిణ భారతం

ఉత్తర భారత్‌తో పోలిస్తే దక్షిణాదిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ కోర్సులపై దక్షిణ భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దక్షిణ భారతం ఇంజినీరింగ్​ విద్యకు కేరాఫ్ అడ్రస్​గా మారింది.

Engineering‌ Education
ఇంజినీరింగ్‌ విద్య
author img

By

Published : Aug 11, 2021, 8:42 AM IST

ఇంజినీరింగ్‌ విద్యకు దక్షిణ భారతం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దేశంలోని బీటెక్‌ సీట్లలో 54 శాతం ఇక్కడి 5 రాష్ట్రాలు (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ), ఒక కేంద్ర పాలిత ప్రాంతం (పుదుచ్చేరి)లోనే ఉన్నాయి. ఎంసీఏలోనూ 44 శాతం సీట్లు ఈ రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉండటం మరో విశేషం. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రాల వారీగా ఆయా కోర్సుల సీట్లను అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఖరారు చేసింది. దక్షిణ భారతంలో 2015-16లో 48.77 శాతం ఉన్న బీటెక్‌ సీట్లు.. ఆరేళ్లలో 5.3 శాతం పెరగడం గమనార్హం. దేశంలో ఈ ఏడాది 12,47,667 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉండగా.. వీటిలో 6,74,697 సీట్లు దక్షిణాదిలోనే ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఉత్తర భారత్‌ రాష్ట్రాల్లో సీట్ల తగ్గుదల కనిపిస్తుండగా.. దక్షిణ భారత్‌ వాటా ఏటేటా పెరుగుతోంది. ఎంసీఏలోనూ 70,065 సీట్లలో 30,812 సీట్లు (44 శాతం) సౌత్‌లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ, పీజీడీఎం) సీట్లు 3,99,405 (3,086 కళాశాలలు) ఉండగా.. అందులో దక్షిణ భారత్‌లో 1,57,632 సీట్లు (39.46 శాతం) ఉన్నాయి.

ఇంజినీరింగ్‌ విద్య

‘‘టెక్నాలజీ కోర్సులపై దక్షిణ భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. అన్ని రకాల కోర్సుల్లో చేరుతున్నారు’’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘ఉత్తర భారత్‌తో పోలిస్తే దక్షిణాదిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అందువల్లే ఉత్తర భారత్‌ నుంచి వేలాది మంది దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ చేరుతుంటారు’’ అని జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల వారీగా వివరాలు

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ దక్షిణాదిలోనే ప్రారంభం

‘‘ఇంజినీరింగ్‌ విద్య ప్రైవేట్‌ రంగంలో ప్రారంభమైంది కర్ణాటకలోనే. తర్వాత తమిళనాడు, అనంతరం ఉమ్మడి ఏపీలో ప్రైవేట్‌ కళాశాలలు వచ్చాయి. ఫలితంగా ఇంజినీరింగ్‌ విద్యకు ఈ మూడు రాష్ట్రాలు కేరాఫ్‌గా మారాయి. ఇంజినీరింగ్‌తోపాటు వైద్య విద్యపైనా దక్షిణాదిలో ఆసక్తి కనిపిస్తుంది’’ అని జేఎన్‌టీయూహెచ్‌ మాజీ ఉపకులపతి డీఎన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: Central Vigilance Commission: 'ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు ఇవ్వడం చెల్లదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.