పర్యావరణ పరిరక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. గాంధీ మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పచ్చదనం పెంపొందించేందుకు నడుం కటింది. అక్టోబర్ 2న ప్రతి డివిజన్లోనూ 3 రైల్వే స్థలాలను ఎన్నుకొని రైలు పట్టాలకు ఆనుకొని ఉన్న 18 స్థలాల్లో చిన్న నర్సరీలను అభివృద్ధి చేశారు. మొత్తంగా 15,000 చదరపు మీటర్ల ప్రదేశాలలో నర్సరీలు ఏర్పాటుచేశారు. అందుబాటులో ఉన్న స్థల వైశాల్యాన్ని అనుసరించి నర్సరీలను ఏర్పాటుచేశారు.
సికింద్రాబాద్ డివిజన్లోని బెల్లంపల్లిలో 6500, డోర్నకల్లో 10,000, వికారాబాద్లో 4000ల మొక్కలు, హైదరాబాద్ డివిజన్లోని లాలాగూడ గేట్ హాల్ట్ 4000ల మొక్కలు, గద్వా ల్ లో 3000 లు, నిజామాబాద్ రైల్వే కాలనీలో 2500లు, భీమవరంలో 4500లు, ఏలూరులో 5500లు, సామర్లకోటలో6600 లు, గుంతకల్లు లో3000 మొక్కలు, నందలూరు లో 3000 , పాకాలలో 2000 లు, నంద్యాలలో 1000, గుంటూరు నడికుడిలో 1000, గుంటూరు డీఆర్ఎం ఆఫీస్ వద్ద 1000, ఆదిలాబాద్లో 3485, నాందేడ్ హింగోలి 4415, జాల్నా 72 మొక్కలు ఏర్పాటుచేశారు.
ఇవీ చూడండి: 'పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి'