ETV Bharat / state

ఏప్రిల్ 1 నుంచి సిర్పూర్ కాగజ్​నగర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు - తెలంగాణ వార్తలు

ఏప్రిల్ 1 నుంచి సిర్పూర్ కాగజ్​నగర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా 30 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడపనున్నట్లు వెల్లడించింది.

south-central-railway-zone-announced-that-sirpur-kagaznagar-to-secunderabad-special-train-started-from-april
ఏప్రిల్ 1 నుంచి సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
author img

By

Published : Mar 16, 2021, 10:26 AM IST

దక్షిణ మధ్య రైల్వే క్రమక్రమంగా రైళ్ల పునరుద్ధరణ చేపడుతోంది. తెలంగాణలో ఎక్కువ మంది ఉపయోగించే సిర్పూర్ కాగజ్​నగర్- సికింద్రాబాద్ డైలీ ప్రత్యేక రైలును వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. జమ్ముకశ్మీర్​లోని జమ్ముతావీ స్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే రైలును వచ్చే నెల 6 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

అదే విధంగా 30 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం-లింగంపల్లి, కడప-విశాఖపట్నం, భువనేశ్వర్-చెన్నై, విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ తదితర రైళ్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: వాతావరణం మార్పుతో వైరల్‌ పంజా... అశ్రద్ధ తగదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.