ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు చేసింది. రైలు బయలుదేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని సూచించింది. టికెట్లు ఉన్నవారికి మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ రైళ్లకు రిజర్వు చేయని టికెట్లు జారీచేయమని స్పష్టం చేసింది.
దుప్పట్లు సైతం ఇవ్వబోం..
కరోనా లక్షణాలున్న ప్రయాణికులను అనుమతించబోమన్న ద.మ.రైల్వే.. రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లు సైతం ఇవ్వబోమని పేర్కొంది. ప్రతి ఒక్కరూ కనీస సామాన్లతోనే ప్రయాణించాలని తెలిపింది. గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రయాణం చేయకపోవడమే మంచిదని సూచించింది. రైళ్లలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్న రైల్వే శాఖ.. రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరింది.
ఇదీ చూడండి : మిడతా.. మిడతా ఊచ్... వస్తే చంపేస్తామోచ్!