ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఏసీ తగ్గించారు.. ఉలన్ దుప్పట్లు ఇస్తామంటున్నారు...

కరోనా నియంత్రణకు రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యం, ఏసీ కోచ్​లో ఉలన్ దుప్పట్లు, ఏసీలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

south central railway
కరోనా నియంత్రణకు రైల్వే శాఖ చర్యలు.
author img

By

Published : Mar 14, 2020, 8:22 PM IST

Updated : Mar 14, 2020, 11:48 PM IST

కరోనా వైరస్​ కట్టడికి దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రైళ్లలోని ఏసీ కోచ్​లలో ఉలన్ దుప్పట్లను ప్రయాణికుల కోరికపై సరఫరా చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల చరవాణీలకు ఇందుకు సంబంధించిన సంక్షిప్త సమాచారం అందజేయడం జరుగుతుందని రైల్వే అధికారులు వివరించారు. ఈ విధానం ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. బెడ్ షీట్లు, దిండ్లు, కవర్ ల పంపిణీ మాత్రం యధావిధంగా కొనసాగుతుందని ద.మ.రైల్వే స్పష్టం చేసింది.

ఏసీ కోచ్​లలో ఉష్ణోగ్రతలు 23 నుంచి 25 డిగ్రీల వరకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉలన్ దుప్పట్లు అవసరం లేని ప్రయాణికులు రైల్వేతో సహకరించి తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలని ద.మ.రైల్వే విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే ప్లాట్ ఫారాలు, ప్రయాణికులు కూర్చునే స్థలాలు, సీట్లు, మెట్ల రైలింగ్​లు, తలుపుల రైలింగులు, కిటికీలున్న ప్రదేశాల్లో అంటురోగ క్రిముల నివారణ కోసం శుభ్రతా చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి: కరోనా భయపడేంత పెద్ద ఉత్పాతం కాదు: సీఎం

Last Updated : Mar 14, 2020, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.