Bharat Gaurav train started Today From Secunderabad: దేశంలోనే మొట్టమొదటి పుణ్య క్షేత్రాల యాత్ర పేరుతో ప్రారంభించిన.. భారత్ గౌరవ్ రైలును నేడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ రైలు దాదాపు 9రోజులు పాటు దేశంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు భక్తులను దర్శనానికి తీసుకొని వెళ్లనుంది. ఈయాత్రలో భాగంగా మొదటి రైలును నేడు ప్రారంభించారు. రెండో రైలును వచ్చే నెల 18న ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని అనేక మంది సెలవు రోజులు కావడంతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారనే ఉద్దేశ్యంతో.. దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ పేరిట ప్రత్యేకమైన రైలు సేవలను తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొని వచ్చింది. నేడు ప్రారంభమైన ఈ భారత్ గౌరవ్ రైలు 8 రోజుల పాటు పూరీ, కోణార్క్, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ మీదగా ప్రయాణిస్తుంది. మళ్లీ తిరిగి ఈ నెల 26న సికింద్రాబాద్ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అలాగే మరోరైలు ఏప్రిల్ 18న బయలుదేరి.. మళ్లీ ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఏప్రిల్ 25న తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుందని తెలిపారు.
ప్రధాన స్టేషన్లలో ఆగనున్న రైలు: ఈ భారత్ గౌరవ్ రైలు ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్టణం, విజయనగరం వంటి ప్రధాన రైల్వేస్టేషన్స్‌లో ఆగుతుంది. ఈయాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ దేవాలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, కారిడార్, కాశీలో గంగా హారతి, అయోధ్య రామజన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, శంకర విమాన మండపం, హనుమాన్ మందిరం వంటివి ఉన్నాయి.
South Central Railway Special Offers: ఈ రైలులో 700 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. కానీ వీటిని 3 వేర్వేరు ప్యాకేజీలుగా నిర్ణయించామని చెప్పారు. ఎకానమీ క్లాస్: ఈ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ. 15,300.. డబుల్ ఆర్ ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 13,955.. ఐదేళ్ల నుంచి 11ఏళ్ల పిల్లలకు రూ. 13,060 వసూలు చేస్తున్నామని వివరించారు.
స్టాండర్డ్ క్లాస్: ఈ క్లాస్‌లో సింగిల్ షేరింగ్ అయితే రూ. 24,085.. డబుల్ ఆర్ ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 22,510గా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ విభాగంలో ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ. 21,460 గా వసూలు చేస్తున్నామని వివరించారు.
కంఫర్ట్ క్లాస్: ఈ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ. 31,510.. డబుల్ ఆర్ ట్రిపుల్ షేరింగ్‌కు రూ.29,615లు ఛార్జీలు వసూలు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ. 28,360 వసూలు చేయనున్నారు.
ఇవీ చదవండి: